స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ గట్టిగా వినపడుతుంది. కొద్ది రోజులుగా ఆమె పేరుతో ఫేక్ వార్తలు, అబద్ధపు ప్రచారాలు పెరగడంతో రకుల్ చాలా కోపంగా ఉంది. మొన్నామధ్య ఎవరో తన వాట్సాప్ నెంబర్ ఇదేనంటూ ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఆ వార్త అబద్ధమని రకుల్ అప్పుడే క్లారిటీ ఇచ్చిన, తాజాగా మరో వ్యక్తి ఆమె సన్నబడటానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి, ఒక డాక్టర్ వీడియోను షేర్ చేస్తూ తెగ ప్రచారం చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో రకుల్ దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Also Read : Andhra King Thaluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ డేట్..?
రకుల్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘నిజాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వారిని చూస్తుంటే నిజంగానే భయమేస్తుంది’ అని ఆవేదన వ్యక్తం చేసింది. సర్జరీ చేయించుకోవడం అనేది ఎవరికైనా పర్సనల్ విషయమని, దాన్ని తాను తప్పు పట్టనని చెప్పింది. కానీ, కష్టపడి ఎక్సర్‌సైజ్ చేస్తే కూడా బరువు తగ్గొచ్చు అనే విషయాన్ని మర్చిపోయి, తన గురించి ఇలా అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రం అసహ్యంగా ఉందని మండిపడింది. చివరిగా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చింది. తనపై ఫేక్ ప్రచారం చేసిన వ్యక్తి వీడియోను కూడా తన పోస్ట్‌కు జత చేయడంతో ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.