డ్యూటీలో భాగంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో దాదాపు రూ.3 కోట్ల విలువైన 4 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రోడ్డుమార్గాన తరలిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు. వారు.. ఆ బంగారాన్ని కోల్‌కతా నుంచి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా కార్లను తనిఖీ చేస్తుండగా.. కారు డిక్కీలో బంగారం దాచి తీసుకెళ్తున్న ముఠా గుట్టు బయట పడింది. దీంతో.. బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బంగారాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.