Yamaha R15M: మార్కెట్లోకి న్యూ R15M బైక్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
- భారత మార్కెట్లోకి యమహా మోటార్ కొత్త R15M బైక్
- కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులోకి
- అదిరిపోయిన కొత్త ఫీచర్లు
- మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.198300..
- కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ ధర రూ.208300.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యమహా మోటార్ భారత మార్కెట్లోకి కొత్త R15M బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్‌లో కొత్త కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా.. కొత్త ఫీచర్లు చేర్చారు. మెటాలిక్ గ్రేలో R15M ధర రూ.1,98,300 లభిస్తుంది. కొత్త కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ రూ.2,08,300కి అందుబాటులో ఉంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. R15M బైక్ బాడీవర్క్ కార్బన్ ఫైబర్ నమూనాతో తయారు చేశారు. దీనికి.. వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఈ నమూనాను ఫ్రంట్ కౌల్, సైడ్ ఫెయిరింగ్.. వెనుక వైపు ప్యానెల్‌ల పార్శ్వాలపై చూడవచ్చు. కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ కాకుండా.. R15Mకి ఆల్-బ్లాక్ ఫెండర్, ట్యాంక్‌పై కొత్త డీకాల్స్, సైడ్ ఫెయిరింగ్ అలాగే బ్లూ వీల్స్ కూడా ఉన్నాయి.
PM Modi: గణపతిని కూడా కటకటాల వెనక్కి నెట్టిన ఘనత కాంగ్రెస్‌ది
Also Read
- అనయా : ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
లుక్ మరియు డిజైన్:
R15Mలో అనేక కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్‌లను కలిగి ఉంది. ఈ ఫంక్షన్లను Y-కనెక్ట్ అప్లికేషన్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ (Android) పరికరాలైన గూగుల్ ప్లే స్టోర్, iOS.. App Storeలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను కనెక్ట్ చేయడానికి రైడర్ తన స్మార్ట్‌ఫోన్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఈ మోడల్ మెరుగైన స్విచ్ గేర్, కొత్తగా రూపొందించిన ఎల్ఈడీ లైసెన్స్ ప్లేట్ లైట్‌ని కలిగి ఉంది.
ఇంజిన్ పవర్:
న్యూ R15M బైక్‌లో ఎటువంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఈ బైక్.. ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన 155 cc ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7,500 rpm వద్ద 14.2 Nm గరిష్ట టార్క్.. 10,000 rpm వద్ద 18.10 bhp గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. స్లిప్, అసిస్ట్ క్లచ్, క్విక్‌షిఫ్టర్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ బైక్.. యమహా ట్రాక్షన్ కంట్రోల్.. VVAని కూడా పొందుతుంది.
కంపెనీ అంచనాలు:
యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఇషిన్ చిహానా మాట్లాడుతూ, “యమహా బైక్‌లు 2008లో లాంచ్ అయినప్పటి నుంచి తమ థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రసిద్ధి చెందాయి. ఇన్-క్లాస్ పనితీరు, మన అంతర్జాతీయ మోడల్‌లకు బాగా తెలిసిన సూపర్‌స్పోర్ట్ బైక్‌ను ఆస్వాదించడానికి భారతదేశంలోని చాలా మంది వినియోగదారులను ఎనేబుల్ చేసింది.” అని తెలిపారు. న్యూ R15M శక్తివంతమైన ఇంజన్, వినూత్నమైన ఫీచర్లు, రేసీ డీకాల్స్ మరియు స్పోర్టి కార్బన్-ఫైబర్ ప్యాట్రన్డ్ యాక్సెంట్‌లతో ముందుకొస్తుంది. ఈ ఫీచర్లు తమ కస్టమర్లకు నచ్చుతాయని చెప్పారు.
తాజావార్తలు
-
అనయా : ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
-
Saif Ali Khan Attack: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక మలుపు.. క్షమాభిక్ష కోరిన నిందితుడు
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్‌గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!