Champions Trophy: ‘భారత్ పాకిస్థాన్ రాకపోతే..’ బీసీసీఐని హెచ్చరించిన పాక్ మాజీ కెప్టెన్
- పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
- టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే.. భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదు
- పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పాకిస్థాన్‌లో జరగనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా? అనేది ప్రశ్నగానే మిగిలి ఉంది. ఈ నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించకపోతే, భవిష్యత్తులో పాక్ జట్టు కూడా ఏ టోర్నీ కోసం ఇండియాకు వెళ్లదని అని అన్నాడు.
Duleep Trophy: సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
పాకిస్థాన్‌లో పర్యటించేందుకు బీసీసీఐని ఒప్పించాలని మాజీ భారత ఆటగాళ్లకు మొయిన్ ఖాన్ సలహా ఇచ్చాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్ వంటి భారత మాజీ క్రికెటర్లు రాజకీయాలను క్రికెట్‌కు దూరంగా ఉంచాలని.. బీసీసీఐకి చెప్పాలని సూచించారు. రాజకీయ అంశాలతో క్రికెట్‌కు అంతరాయం కలగకూడదు.. భారత్, పాక్‌ల ఆటలను చూడటానికి అభిమానులు ఎంతో ఇష్టపడతారని అన్నాడు. మరోవైపు.. ఖాన్ ఐసీసీ పాత్రపై కూడా ప్రశ్నలు లేవనెత్తాడు. “భారత్ తన ప్రత్యర్థులను గౌరవించేలా ఐసీసీతో కలిసి పనిచేయాలి. ఒకవేళ వారు పాకిస్థాన్ రాకపోతే, భవిష్యత్తులో భారత్‌లో జరిగే ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనే నిర్ణయం గురించి పాకిస్తాన్ ఆలోచించాల్సి ఉంటుంది” అని తెలిపారు.
Bangladesh: 15 రోజుల్లో బంగ్లాదేశ్ హిందువులపై 1000కి పైగా దాడులు..
పాకిస్థాన్ 2008లో మొత్తం ఆసియా కప్, గత ఏడాది అదే టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 1996 తర్వాత పాకిస్థాన్ ఒక ప్రధాన ICC టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఐసీసీ టోర్నీ కోసం టీమిండియాను పాకిస్థాన్‌కు పంపుతుందా లేదా అనే విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపైనే అందరి దృష్టి నెలకొంది. 2012-13 సీజన్ నుంచి భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఐసిసి టోర్నీలో భారత్‌తో తలపింది. 2008 నుంచి ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!