రోల్స్ రాయిస్ సూపర్ లగ్జరీ SUV.. కుల్లినన్ సిరీస్ II కొత్త వెర్షన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. కల్లినన్ సిరీస్ II ప్రారంభ ధర రూ. 10.50 కోట్లు కాగా.. బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ సిరీస్ II ను కూడా ప్రారంభించింది. దీని ధర రూ. 12.25 కోట్ల (ఎక్స్-షోరూమ్).
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో.. హిజ్బుల్లాను ఇజ్రాయెల్ చావు దెబ్బ తీసింది. బీరూట్‌పై జరిగిన వైమానిక దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధృవీకరించింది. ఇజ్రాయెల్ ఆర్మీ IDF సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత కాన్పూర్‌లో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. భారత ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు చాలా దూరం ప్రయాణించి స్టేడియంకు చేరుకుంటున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో విరాట్ కోహ్లి వీరాభిమాని దాదాపు 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కి స్టేడియానికి వచ్చాడు.
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయ సరిహద్దు గోడ కుప్పకూలింది. కాగా.. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని తెలుస్తోంది.
ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు లెబనాన్‌లోకి ప్రవేశించి దాడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో.. ఉత్తర సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు మోహరించాయి. దీంతో.. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌పై దాడి చేయబోతున్నట్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు చిక్కుల్లో పడుతున్నారు. మొదట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే న్యాయపరమైన సమస్యలతో సతమతం అవుతున్నారు. మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ నేత ఎన్‌ఆర్ రమేష్ కర్ణాటక లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో వారం రోజులుగా మతపరమైన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 37 మంది మరణించారు. సుమారు 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుర్రం జిల్లాలో ఇస్లాం మరియు షియా వర్గానికి చెందిన తెగల మధ్య మత ఘర్షణలు తలెత్తాయి.
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైర్వా కొడుకు రీలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి వెనుకాల పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. వీడియోలో ఓపెన్ జీపులో నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు. కారులో కూర్చున్న యువకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం ప్రేమ్‌చంద్ బైర్వా కుమారుడు ఉన్నాడు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ టార్గెట్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంఎస్‌పి యొక్క పూర్తి అర్థం ఏంటో తెలుసా..? అని ప్రశ్నించారు. హర్యానాలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం 24 పంటలను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి కొనుగోలు చేస్తోందని అమిత్ షా తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.