నార్సింగిలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నార్సింగి మెయిన్ రోడ్, హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన కొత్త షో రూమ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటి సంయుక్త మీనన్ హాజరై సందడి చేశారు. అనంతరం.. జ్యోతి ప్రజ్వళన చేసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.
జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు. మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా.. తన ఐదవ ప్రయత్నంలో జపాన్ ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఫ్యూమియో కిషిదా తర్వాత తొమ్మిది మంది అభ్యర్థుల మధ్య జరిగిన అత్యంత పోటీ రేసులో షిగేరు ఇషిబా విజయం సాధించారు.
భారతదేశం-రష్యాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ కంపెనీలో కనీసం 15 శాతం టెక్నికల్ పోస్టులను అగ్నివీరుల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. అనేక సంస్థల్లో అగ్నివీరులకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అయితే ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. టెక్నికల్ పోస్టులే కాకుండా అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ అవసరాలకు అనుగుణంగా అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని బ్రహ్మోస్ తెలిపింది.
పండుగల కోసం ఇంటికి వెళ్తున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల కోసం ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్తారు. ఈ క్రమంలో.. భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లు జత చేశారు. పండుగల సమయంలో కనిపించే అదనపు రద్దీని తగ్గించడానికి 12,500 కోచ్‌లను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టు మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరగడంతో క్రికెట్ జట్టు ఆటగాళ్లకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే మ్యాచ్‌కు వ్యతిరేకంగా వీహెచ్‌పీ బంగ్లాదేశ్ జెండాను దహనం చేసి రచ్చ చేశారు. ఈ క్రమంలో మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చిన బంగ్లా వీరాభిమాని టైగర్ రాబీపై కొందరు దాడి చేశారు. దీంతో.. పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్చారు.
గాజా, లెబనాన్‌లలో హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పై మరో దేశం ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడి టెల్ అవీవ్-సెంట్రల్ ఇజ్రాయెల్‌లో తెల్లవారుజామున చేసింది.
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే.. ఈ మ్యాచ్ ముగియాల్సిన సమయం కంటే ముందుగానే ముగిసిపోయింది. కారణమేంటంటే.. వర్షం ఆటంకం కలిగించింది. స్టేడియం వర్షం పడి కొంత చిత్తడిగా ఉంటడంతో ఆట ఒక గంట ఆలస్యంగా మొదలైంది. లంచ్ విరామం తర్వాత కొంతసేపు మ్యాచ్ జరిగింది. ఇంతలో మళ్లీ వర్షం పడింది. చాలా సేపటి వరకూ వర్షం తగ్గకపోవడంతో తొలి రోజును ఆటను అంపైర్లు ముగించారు.
ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్‌లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా.. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని అపార్ట్‌మెంట్‌పై వైమానిక దాడిలో హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
యూపీలోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల సిగ్గుమాలిన చర్య వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మక పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అన్ని పరిమితులను అధిగమించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో విద్యార్థులు తమ టీచర్ అశ్లీల ఫోటోలు సృష్టించి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేశారు.
కార్మికులకు, అసంఘటిత రంగ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండగలకు ముందు కానుక ఇచ్చింది. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న జీవన వ్యయం దృష్ట్యా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. పెరిగిన వేతనాలు 2024 అక్టోబర్ 1 నుండి వర్తిస్తాయి.