Yemen-Israel: ఇజ్రాయెల్‌పై ప్రతీకారం..! యెమెన్ తిరుగుబాటుదారులు దాడి
- హమాస్-హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం
- ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
- ఈ క్షిపణిని గాలిలోనే ధ్వంసం చేసిన ఇజ్రాయెల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా, లెబనాన్‌లలో హమాస్-హిజ్బుల్లాతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ పై మరో దేశం ప్రతీకారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగింది. శుక్రవారం ఉదయం యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు టెల్ అవీవ్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే ఈ క్షిపణిని ఇజ్రాయెల్ గాలిలోనే ధ్వంసం చేసింది. ఈ దాడి టెల్ అవీవ్-సెంట్రల్ ఇజ్రాయెల్‌లో తెల్లవారుజామున చేసింది. గురువారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో హిజ్బుల్లా డ్రోన్ చీఫ్ కమాండర్ మహ్మద్ సురూర్ మృతి చెందాడు. ఈ క్రమంలో.. యెమన్ దాడి చేసింది. కాగా.. సురూర్ హౌతీ తిరుగుబాటుదారులకు శిక్షణ ఇచ్చాడు.
Read Also: China: చైనాలో మరోసారి భయంకర మాంద్యం! ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం?
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ఇజ్రాయెల్ మిలటరీ శుక్రవారం ఒక తాజా ప్రకటనలో.. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్ యెమెన్ నుండి ప్రయోగించిన ఉపరితలం నుండి ఉపరితల బాలిస్టిక్ క్షిపణిని ధ్వంసం చేసిందని పేర్కొంది. క్షిపణిని ధ్వంసం చేసిన తర్వాత.. దాని శిథిలాలు ఇజ్రాయెల్ ప్రాంతాల్లో పడిపోవడంతో ప్రభావిత ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. ఈ దాడి తర్వాత హోం ఫ్రంట్ కమాండ్ నుండి కొత్త సూచనలు లేవని IDF తెలిపింది.
Read Also: Kunki Elephants: కుదిరిన ఎంవోయూ.. దసరా తర్వాత ఏపీకి కర్ణాటక కుంకీ ఏనుగులు..
సురూర్ మరణానికి ప్రతీకారం
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. హౌతీ తిరుగుబాటుదారులు దాడికి బాధ్యత వహించారు. కానీ దాని వెనుక కారణాన్ని వెల్లడించలేదు. అయితే.. గురువారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ తాజా దాడికి ప్రతీకారంగా హౌతీ తిరుగుబాటుదారులు ఈ చర్య తీసుకున్నట్లు భావిస్తున్నారు. గురువారం బీరుట్‌లోని నివాస భవనాన్ని ఇజ్రాయెల్ వైమానిక దాడితో పేల్చివేసింది. హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ హుస్సేన్ సురూర్ భవనం లోపల ఉన్నట్లు వెల్లడైంది. ఈ దాడిలో సరూర్ చనిపోయాడు. హిజ్బుల్లా కూడా అతని మరణాన్ని ధృవీకరించింది.
צה"ל: האזעקות במרכז – עקב טיל ששוגר מתימן • תיעוד מקריית מלאכי >>
@Doron_Kadosh @galdjerassi pic.twitter.com/5l6XkXtxiC— גלצ (@GLZRadio) September 26, 2024
తాజావార్తలు
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..