జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నికయ్యారు. మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా.. తన ఐదవ ప్రయత్నంలో జపాన్ ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నారు. ఫ్యూమియో కిషిదా తర్వాత తొమ్మిది మంది అభ్యర్థుల మధ్య జరిగిన అత్యంత పోటీ రేసులో షిగేరు ఇషిబా విజయం సాధించారు. 67 ఏళ్ల ఇషిబా.. రాజకీయ జీవితం 38 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ సమయంలో అయన భద్రతా సమస్యలపై దృష్టి సారించాడు. జపాన్ గ్రామీణ సంఘాలను పునరుద్ధరించాడు.
Agniveers: బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభాగాలలో అగ్నివీరులకు 15 శాతం రిజర్వేషన్లు..
ఇషిబా ఒక అనుభవజ్ఞుడైన శాసనకర్త. జపాన్ మాజీ రక్షణ మంత్రి, పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)లో ఉన్నారు. జపాన్ 102వ ప్రధానమంత్రిగా అక్టోబర్ 1న షిగెరు ఇషిబా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు కిషిదా అధికారికంగా పదవీ విరమణ చేయనున్నారు. రన్-ఆఫ్ ఓటులో రాయిటర్స్ ప్రకారం.. ఇషిబా కరడుగట్టిన జాతీయవాది సనే తకైచిని ఓడించారు. ఈ నాయకత్వ ఎన్నికలు అనూహ్యతతో గుర్తించబడ్డాయి. రికార్డు స్థాయిలో తొమ్మిది మంది అభ్యర్థులు ఈ స్థానం కోసం పోటీ పడ్డారు.
Ashwini Vaishnaw: ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్.. పండుగల సందర్భంగా 6,000 ప్రత్యేక రైళ్లు
ఇషిబా ఒక మారుమూల గ్రామీణ ప్రాంతం తొట్టోరిలో జన్మించాడు. ఆయన బ్యాంకింగ్ వృత్తిని ప్రారంభించే ముందు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివాడు. 29 సంవత్సరాల వయస్సులో.. అయన 1986లో LDPతో తన మొదటి పార్లమెంటరీ స్థానాన్ని గెలుచుకున్నాడు. తన రాజకీయ ప్రయాణంలో ఆయన LDP సెక్రటరీ జనరల్, వ్యవసాయ మంత్రితో సహా అనేక కీలక పదవులను నిర్వహించాడు.