Agniveers: బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభాగాలలో అగ్నివీరులకు 15 శాతం రిజర్వేషన్లు..
- బ్రహ్మోస్ ఏరోస్పేస్ విభాగాలలో అగ్నివీరులకు 15 శాతం రిజర్వేషన్లు
- అనేక సంస్థల్లో అగ్నివీరులకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపిన బ్రహ్మోస్
- ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం-రష్యాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ కంపెనీలో కనీసం 15 శాతం టెక్నికల్ పోస్టులను అగ్నివీరుల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. అనేక సంస్థల్లో అగ్నివీరులకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అయితే ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. టెక్నికల్ పోస్టులే కాకుండా అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ అవసరాలకు అనుగుణంగా అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని బ్రహ్మోస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్షిపణిని తయారు చేసే ఈ కంపెనీ.. అగ్నివీరులతో కలిసి పని చేయనుంది. అందుకోసం వారిని అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద చేర్చుకోనుంది. అలాగే.. కంపెనీ తన వ్యాపారానికి సంబంధించిన ఇతర అనుబంధ సంస్థలు కూడా అగ్నివీర్‌లను నియమించుకోవడానికి ప్రోత్సహిస్తోంది.
బ్రహ్మోస్‌కి అగ్నివీరులు ఎందుకు కావాలి..?
ఆర్మీలో రిక్రూట్‌మెంట్ కోసం సాధారణ ప్రక్రియను తొలగించడం ద్వారా భారత ప్రభుత్వం 2022 నుండి అగ్నివీర్ యోజనను ప్రారంభించింది. ఇందులో రిక్రూట్ చేయబడిన యువకులు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో సేవలందిస్తారు. ఈ సమయంలో సైనిక వ్యూహాలతో పాటు.. సాంకేతికత, నైపుణ్యాలను కూడా పొందుతారు. అగ్నివీరులు సైన్యంలో మెరుగైన శిక్షణ పొందుతారు. అలాంటప్పుడు వారిని నియమించుకున్నప్పుడు.. శిక్షణ కోసం విడిగా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని బ్రహ్మోస్ తెలిపింది. అలాగే తమ కంపెనీలో అధిక శిక్షణ పొందిన వర్క్ ఫోర్స్‌ను సృష్టిస్తుందని.. ఇది కంపెనీకి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని బ్రహ్మోస్ పేర్కొంది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
Ashwini Vaishnaw: ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్.. పండుగల సందర్భంగా 6,000 ప్రత్యేక రైళ్లు
భాగస్వామ్య కంపెనీల్లో కూడా అగ్నివీర్‌ను కొనసాగించడంపై చర్చ కొనసాగుతోంది. కంపెనీ డిప్యూటీ CEO ప్రకారం.. ‘భారత రక్షణ పరిశ్రమలో పనిచేస్తున్న 250 కంటే ఎక్కువ బృందాలు బ్రహ్మోస్‌లో భాగంగా ఉన్నాయి. అందరితో మాట్లాడాం. మా బృందంలో మాతో చేరడానికి మొదటి బ్యాచ్ అగ్నివీర్స్ కోసం భారత రక్షణ పరిశ్రమ ఎదురుచూస్తోంది. దీన్ని మరింత విస్తరించాలనుకుంటున్నాం.’ అని తెలిపారు. తాము తమ విక్రేతలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాము.. తాము తమ భాగస్వామి సంస్థలతో కూడా మాట్లాడుతున్నాము.. ప్రతి ఒక్కరూ తమ సంస్థల్లో కనీసం 15 శాతం ఉద్యోగాలను అగ్నివీరులకి కేటాయించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించినప్పుడు ప్రతిపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. నిరంతర నిరసనల తరువాత.. ప్రభుత్వం కొన్ని సైనిక సంస్థలలో అగ్నివీరులకి రిజర్వేషన్‌ను కల్పించింది. అందులో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CAPFలలో 10 శాతం, హర్యానా ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్‌ను అందించాయి. దీంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం కూడా అగ్నివీర్‌కు రాష్ట్ర పోలీసు, పిఎసిలో ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!