Israel-Lebanon: హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ విధ్వంసం.. కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ హతం..!
- లెబనాన్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్
- గత వారం నుంచి హిజ్బుల్లాపై వైమానిక దాడులు
- గురువారం బీరుట్ శివార్లలోని అపార్ట్‌మెంట్‌పై వైమానిక దాడి
- హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ హతం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా మిలింటెట్లు , వారి స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. గత వారం నుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్‌లోని 2000కు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. కాగా.. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలోని అపార్ట్‌మెంట్‌పై వైమానిక దాడిలో హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ మొహమ్మద్ హుస్సేన్ సురూర్ ను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే.. కమాండర్ చనిపోయాడా లేదా అనే దానిపై హిజ్బుల్లా స్పందించలేదు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఐడిఎఫ్ బీరూట్‌లో హిజ్బుల్లా ఉగ్రవాది ముహమ్మద్ హుస్సేన్ సరూర్‌పై దాడి చేసి హతమార్చింది.
Read Also: Bangladesh: షేక్ హసీనా సర్కార్ పతనంపై తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మహమ్మద్ హుస్సేన్ సరూర్ ఎవరు..?
హిజ్బుల్లా డ్రోన్ కమాండర్ దాక్కున్న బీరుట్‌లోని దహియాలో బహుళ అంతస్తుల భవనంపై ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ తెలిపింది. UAVలు, పేలుడు పరికరాలను ఉపయోగించి ఇజ్రాయెల్ పౌరులు.. IDF సైనికులపై అనేక తీవ్రవాద దాడులకు పాల్పడింది. హిజ్బుల్లాలో సరూర్ దీర్ఘకాల సభ్యుడు అని IDF తెలిపింది. మరోవైపు..ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం న్యూయార్క్‌కు వెళ్లే సమయంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హత్య ఆపరేషన్‌కు ఆమోదం తెలిపారని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
Read Also: Devara: అందరి ఎదురుచూపులు అందుకే!
మరోవైపు, బీరూట్‌లోని దక్షిణ శివారు ప్రాంతమైన దహియాలోని భవనంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గురువారం మధ్యాహ్నం జరిపిన దాడిలో కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించారు. 15 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిలో ఒక మహిళ కూడా ఉంది.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. CNN ప్రకారం.. ఈ ప్రాంతం హిజ్బుల్లా బలమైన ఉనికితో జనసాంద్రత కలిగిన ప్రాంతం.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..