ఇండియా ఉమెన్స్ టీమ్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే పాకిస్థాన్‌పై విజయం సాధించినా.. టీమిండియాకు సెమీస్ మార్గం అంత సులువు కాదు. టీమిండియా తదుపరి రెండు మ్యాచ్‌లు ఆసియా ఛాంపియన్ శ్రీలంక, డిఫెండింగ్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరగనున్నాయి. సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ముఖ్యం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అయితే ఈ టోర్నీకి భారత్‌తో పాటు అన్ని జట్లూ పాకిస్థాన్‌కు వస్తాయనడంలో సందేహం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నక్వీ అన్నారు. రాజకీయ సమస్యల కారణంగా భారత్, పాకిస్థాన్‌ల మధ్య చాలా కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదని చెప్పారు. ఈ రెండు జట్లు బహుళ-దేశాల టోర్నమెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి రావడంతో…
స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో రోజు క్షీణిస్తోంది. ఈ క్షీణతతో అదానీ గ్రూప్ షేర్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా పతనావస్థలో ఉంది. సెన్సెక్స్, నిఫ్టీలలో అదానీ పోర్ట్స్ 4.11 శాతం పడిపోయి టాప్ లూజర్‌గా ఉంది. అదానీ టోటల్ గ్యాస్ 2.94% తగ్గింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 2.96 శాతం పడిపోయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడు సంజీవ్ అరోరా తదితరులపై భూ మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జలంధర్, లూథియానా, గురుగ్రామ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని లూథియానాలోని సంజీవ్ అరోరా నివాసం, హర్యానాలోని గురుగ్రామ్‌తో సహా దాదాపు 16-17 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడికి బీజేపీయే కారణమని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 49 బంతులు ఉండగానే చేధించింది. 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది.
చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గర ఎయిర్ షోలో తొక్కిసలాట జరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఎయిర్ షో చూసేందుకు జనం పోటెత్తారు. దీంతో.. మెరీనా బీచ్ మొత్తం జనసంద్రంగా మారింది. బీచ్ కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రానున్న వేసవి కాలంలో నెలకొనే ఇసుక డిమాండ్కు అనుగుణంగా లభ్యత పెంపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాణిజ్యపన్నుల శాఖ ఛీఫ్ కమీషనర్, అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యాదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి తీసుకురాగా.. స్టాక్‌యార్డ్‌ల వద్ద 4.8 లక్షలు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్దంగా ఉందన్నారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నాగరాజా రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడి అధిక మొత్తంలో డబ్బులను పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా ఎక్కవయ్యాయి. దీంతో.. అప్పుల బాధ భరించలేక రెండ్రోజుల క్రితం (శుక్రవారం) తన కుటుంబంతో కలిసి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శుక్రవారం భార్యాభర్తలిద్దరూ మృతి చెందగా.. నిన్న చికిత్స పొందుతూ కుమార్తె సునీత మృతి చెందింది. కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ కుమారుడు దినేష్ సైతం మృతి చెందాడు.…
రుషికొండ పై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి.. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదన్నారు. రుషికొండ కట్టడాలు అవినీతి సామ్రాజ్యానికి సూచికగా మ్యూజియం ఏర్పాటు చేయలేమోనని ఎద్దేవా చేశారు.