శాంసంగ్ నుంచి గెలాక్సీ A16 5Gని ఆవిష్కరించింది. మొదటి ఫోన్‌తో పోలిస్తే ఈ ఫోన్ చాలా అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. కొత్త గెలాక్సీ A16 5G 6.7-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లు, 6 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో మార్కెట్లోకి వస్తుంది. కంపెనీ 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లను అందిస్తోంది.
టీమిండియా మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే.. అది ఒకే రోజు, ఒకే సమయంలో టీమిండియా మ్యాచ్‌లు ఫ్యాన్స్ కు పండగే పండగ.. ఒకవైపు పురుషుల జట్టు.. మరోవైపు మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలో జరగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా దుబాయ్ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్ కూడా అక్టోబర్…
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్ లో భాగంగా.. నిన్న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ పేసర్ అరుంధతి రెడ్డిని ఐసీసీ మందలించింది. ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించినందుకు అరుంధతి దోషిగా తేలింది.
భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సోమవారం క్రీడలకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో దీపా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన దీపా.. స్వల్ప తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారతదేశపు తొలి మహిళా జిమ్నాస్ట్‌గా 31 ఏళ్ల దీపా నిలిచింది. కాగా.. రియో ఒలింపిక్స్‌లో వాల్ట్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది.
మహిళలు అన్ని రంగాల్లో తమవంతు సహకారం అందిస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కూడా మహిళల సహకారం కనిపిస్తుంది. అయితే.. దేశంలో ఒక మహిళ ప్రారంభించిన బ్యాంకు ఉంది. అది కేవలం మహిళలచే నిర్వహించబడుతుంది. ఈ బ్యాంకు మహిళల అభ్యున్నతి కోసం, బ్యాంకింగ్ రంగానికి అనుసంధానం చేయడం కోసం ప్రారంభించారు. ఈ బ్యాంక్ 1998లో స్థాపించారు.. ఆ తర్వాత సంవత్సరం RBI నుండి లైసెన్స్ పొందింది.
హ్యుందాయ్ త్వరలో క్రెటా ప్రత్యేక ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ను శాసిస్తున్న హ్యుందాయ్ క్రెటా.. చాలా కాలంగా అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది.
నిరుద్యోగో యువకులకు భారీ శుభవార్త.. పదో తరగతి పాస్ అయి ఉద్యోగం లేదని బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే. భారత ప్రభుత్వం, హోమ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న “ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్” (ITBP) కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల నియామకం కోసం 2024లో భారీ రిక్రూట్‌మెంట్ విడుదలైంది. అందులో మొత్తం 545 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్సై, టెక్నీషియన్, జేఈ (ALP, RPF SI, Technician, JE) ఇతర పోస్టుల కోసం నిర్వహించే రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీలను ఈరోజు ప్రకటించింది.
మానవుడి అవయవాలలో అత్యంత ముఖ్యమైనది. మెదడు సరిగా పనిచేస్తేనే ఏ పనైనా చేయగలం. అయితే.. మెదడుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే.. మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. రోజూ యోగా చేయాలి.. అలాగే వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అలా కాకుండా.. తినడానికి రుచికరంగా ఉన్న స్నాక్స్ తిన్నట్లైతే మీ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
2024 సంవత్సరానికి గానూ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. అమెరికాకు చెందిన విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. మైక్రోఆర్‌ఎన్‌ఏ (జన్యు కార్యకలాపాలను నియంత్రించే ప్రాథమిక సూత్రం)ను కనుగొన్నందుకు ఇద్దరికీ ఈ గౌరవం లభించింది. సోమవారం.. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ అసెంబ్లీ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది.