హర్యానా ప్రజలకు, కార్మికులకు ప్రధాని అభినందనలు తెలిపారు. మోడీ హర్యానాకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'భారతీయ జనతా పార్టీకి మరోసారి స్పష్టమైన మెజారిటీని అందించినందుకు హర్యానా ప్రజలకు నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఏ రాయిని వదిలిపెట్టబోమని నేను వారికి హామీ ఇస్తున్నాను'.అని తెలిపారు.
బెంగళూరులో రిఫ్రిజిరేటర్‌లో ముక్కలు ముక్కలుగా నరికి మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడి నుండి పోలీసులు డెత్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను ఆత్మరక్షణ కోసం చంపినట్లు రాశాడని తెలిపారు. బెంగళూరులోని వయాలికావల్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో మహాలక్ష్మి మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు నిందితుడు ముక్తి రంజన్ రాయ్.. కాగా.. హత్య అనంతరం సెప్టెంబర్ 25 న ఒడిశాలోని భద్రక్ జిల్లాలో చెట్టుకు ఉరివేసుకుని నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గ స్థానాలన్నీ విజయం నమోదు చేసుకున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే.. సీఎం యోగి ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఉన్నట్లు అర్ధమవుతుంది.
తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు ప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు ధ్వంసం కాగా.. ముగ్గురు మృతి చెందారు, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
హైదరాబాద్ పాతబస్తీలోని బండ్లగూడలో అత్త మామలను చంపేందుకు కుట్ర పన్నింది ఓ కోడలు. ఇందుకోసం బ్లాక్ మ్యాజిక్ ను చేసే బురిడి బాబును ఆశ్రయించింది. బ్లాక్ మ్యాజిక్ తో అత్తమామలను చంపేందుకు తనను ఆశ్రయించిన మహిళను బురిడీ కొట్టించాడు నకిలీ బాబా మహమ్మద్ ఖలీద్.. నాజియా అనే మహిళ తన అత్తమామలను బ్లాక్ మ్యాజిక్ తో చంపాలని కుట్ర పన్నింది. అయితే ఆమెనే మోసం చేసే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బ్లాక్ మ్యాజిక్…
మహారాష్ట్రను కాపాడుకునేందుకు.. కాంగ్రెస్, ఎన్సీపీ సీఎంగా ప్రకటించిన ఎవరికైనా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే/యూబీటీ) మద్దతు ఇస్తుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తమపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఓటింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్.. కౌంటింగ్ రోజు భిన్నమైన ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి అధికారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ పూర్తి ఆశలు పెట్టుకుంది కానీ అది జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందో అని ఎన్నికల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ఓటమికి ఈ అంశాలు ప్రముఖంగా నిలిచాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి మాట్లాడారు. కాంగ్రెస్‌కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగులుతుందని ఎగ్జిట్ పోల్ సమయంలోనే తాను చెప్పానని అన్నారు. వస్తున్న ఫలితాలను బట్టి బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మూడోసారి…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వినేష్ ఫోగట్ 6015 ఓట్లతో గెలుపొందారు. వినేష్‌కి మొత్తం 65080 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి యోగేష్ కుమార్‌కు 59065 ఓట్లు వచ్చాయి. తన విజయంపై వినేష్ ఫోగట్ మొదటిసారి స్పందించింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలిదశలో వెనుకబడిన తర్వాత బీజేపీ పునరాగమనం చేసి ట్రెండ్స్‌లో మెజారిటీ సంఖ్యను సాధించింది. ప్రస్తుతం.. బీజేపీ 39 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. హర్యానాలో ట్రెండ్‌లు మెల్లగా అప్‌డేట్ అవుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ బీజేపీ, ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈసీ వెబ్‌సైట్‌లో డేటా అప్‌డేట్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9…