భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు గ్వాలియర్ లో మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అడుగుపెడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి దృష్టి అతని పైనే ఉంది. మయాంక్‌తో పాటు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ బంగ్లాదేశ్‌తో అరంగేట్రం చేస్తున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ కొట్టింది. పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 106 పరుగుల లక్ష్యాన్ని 5 బంతులు ఉండగానే చేధించింది. భారత్ బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉండి జట్టును విజయం వైపు తీసుకెళ్లింది.
బీహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
TVS మోటార్ కంపెనీ కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ బైక్ తక్కువ ధరకు లభించనుంది. TVS రేడియంట్ ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంది.
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 10 ఎకరాలు మిరప పంటను ధ్వంసం చేశాడు రైతు షఫీ. మిరప పంటపై 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే.. మూడు కోతలకు 3 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగో కోతకు ధర పడిపోయిందని.. దీంతో గిట్టుబాట ధర రాక పంట తొలగించానని రైతు చెబుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించారు చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణం అని అన్నారు. పాప తండ్రి ఓ మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు.. అప్పుడు తిరిగి చెల్లించాలంటూ ఆ మహిళను బెదిరించడం, తిట్టడం సివిల్ కోర్టులో కేసు వేస్తామని చెప్పాడు. దీంతో.. అతనిపై పగ పెంచుకుని ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా చిన్నారిని ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టి తరువాత…
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.
మానవులకు నీరు అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మోతాదులో నీరు తాగాలి. ఇది రోజంతా మన శరీరానికి తాజాదనాన్ని అందిస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో.. కడుపు సమస్యలు మొదలవుతాయి. తక్కువ నీరు త్రాగడం వలన శరీరం, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.