రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జనం అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి.. ఏపీలో లాగే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని.. హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. ఏపీలో ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.. పోలింగ్ కొరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగం సమర్ధనీయం కాదన్నారు.
హానర్ కొత్త ట్యాబ్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. హానర్ టాబ్లెట్ జీటీ ప్రో (Honor Tablet GT Pro) వచ్చే వారం చైనాలో విడుదల కానుంది. అందుకు సంబంధించి కంపెనీ హానర్ టాబ్లెట్ జీటీ ప్రో డిజైన్, కలర్ ఆప్షన్స్, కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. ఈ ట్యాబ్ ను హానర్ X60 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో ప్రారంభించనున్నారు. ట్యాబ్‌లో బేస్, ప్రో వేరియంట్‌లు ఉండే అవకాశం ఉంది. టాబ్లెట్ జీటీ ప్రో 12.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం.. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా.. హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏను గెలిపించారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ, అలాగే ఆఫ్‌లైన్‌లోనూ లైసెన్సుల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వీటికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారి నంచి 2 లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. కాగా.. మద్యం షాపుల దరఖాస్తులు 50 వేలు దాటాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం వచ్చిందని అన్నారు.
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్య జ్యోతిపై అవినీతి ఆరోపణలను తన భర్తే బయటపెట్టాడు. ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని భర్త సంచలన ఆరోపణలు చేశాడు.
మంగళగిరి నేతలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలి.. ఆ ఉద్దేశంతోనే ఈసమావేశం ఏర్పాటు చేశాం, పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నామని అన్నారు.
వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు.
జనగామ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీరప్ప గడ్డలో కెమిడి లక్ష్మయ్యకు చెందిన 30 మేకలను గుట్టుచప్పుడు కాకుండా కొట్టం నుండి అర్థరాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. పండగ సమయంలో జిల్లాలో మేకల దొంగతనం కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై బాధితుడు లక్ష్మయ్య పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.