విజయవాడ ఇంద్రకీలాద్రికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, లోకేష్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం.. అమ్మవారికి పట్టువస్త్రాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్పించారు. ఈ క్రమంలో.. సీఎంకు ఆలయ అర్చకులు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. మేళతాళాల నడుమ ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టువస్త్రాలను సమర్పించారు.
Read Also: Jangaon: పండగ ఎఫెక్ట్.. దసరా ముందు 30 మేకలను ఎత్తుకెళ్లిన దొంగలు..
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాలోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు, దేవాదాయ శాఖ అధికారులు దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుకు కొండచరియలు విరిగిపడినవి, వాటిని బాగుచేసినవి ఫోటోలు అధికారులు చూపించారు.
Naga Chaitanya Akkineni: నాగచైతన్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్?
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. చెడు పైన విజయం సాధించే సమయం విజయ దశమి.. తాను పాలకమండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దయతో చెడుని పోగొట్టడమే కాదు… మంచి చేయాలని అమ్మవారిని కోరానని అన్నారు. దేశ, రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.. మూల నక్షత్రం నాడు దుర్గమ్మ దర్శనం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మూల నక్షత్రం నాడు లక్షకు పైగా భక్తులు దర్శనం చేసుకోవడం ఒక నమ్మకం.. అన్ని విషయాల్లో తిరుమల తరువాత రెండవ పెద్ద ఆలయం ఇంద్రకీలాద్రి అని అన్నారు. సేవా కమిటీ సభ్యులు దేవస్ధానంలో సేవలు చేస్తారు.. దుర్గామాత మీద భక్తి ఉన్నవారే ఇక్కడకు రావాలని సీఎం పేర్కొన్నారు.
Read Also: Nayanathara: పిల్లల విషయంలో మరో వివాదంలో లేడీ సూపర్ స్టార్!