మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో.. కేటీఆర్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతుంది. తన ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్ వేశారు.
మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు.. హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ జరిగింది. తమ కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున పరువు నష్టం కేసు వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిగిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసి.. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.' విద్యార్థుల ముందు, గురువుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు @TelanganaCMO. గడిచిన పది నెలలలో కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..?. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమా లేక పార్టీ కార్యక్రమా అని ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు.
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఢిల్లీలో రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 222 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
అందాల విశాఖ సాగరతీరంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) మణిహారంగా మెరవనుంది. మెరుగైన జీతభత్యాలు అందించే 10 వేల ఐటీ ఉద్యోగాలు యువతకు లభించనున్నాయి. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్, ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చే దిశగా విశ్వప్రయత్నాలు చేసి టాటా గ్రూపు చైర్మన్, పెద్దలను ఒప్పించి విశాఖకు టీసీఎస్ ని రప్పించారు.
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. మొదట భారత్ బ్యాటింగ్ చేయనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.