హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో.. గాలిలో 20 నిమిషాల తిరిగిన తర్వాత శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిన్న (బుధవారం) కిడ్నాప్ అయిన శిశువు సేఫ్‌గా ఉంది. హైదరాబాద్‌లో చిన్నారి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ల నుంచి పాపని రక్షించి పోలీసులు సంగారెడ్డికి తీసుకువచ్చారు. కాగా.. శిశువు కిడ్నాప్ అయిన 30 గంటల్లోనే కేసును సంగారెడ్డి పోలీసులు ఛేదించారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ వేదికగా శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అందుకోసం.. టీమిండియా ప్లేయర్స్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. అక్కడి నుంచి నోవాటెల్, తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాధర స్వాగతం పలికారు.
ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సీవీ ఆనంద్ ఐపీఎస్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పాల్గొన్నారు. అనంతరం సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు సబ్సిడరీ క్యాంటీన్(Subsidiary Canteen)ను ప్రారంభించి, అందరికీ సభ్యత్వ కార్డులను అందజేశారు.
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు వైభంగా జరుగుతున్నాయి. పూల వేడుకలో ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతులు, చిన్నారుల ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ప్రపంచమంతా పూలతో దేవుడిని పూజిస్తే.. ఆ పూలనే దేవుడిగా పూజించే బతుకమ్మ పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ఈనెల 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు.. చివరి రోజు (నేడు)సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. నేరుగా హైడ్రా కార్యాలయం నుంచి బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును కమిషనర్ పరిశీలించారు. మురుగుతో నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచినీటి చెరువులుగా తీర్చి దిద్దారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆనంద్ వివరించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. మధ్యాహ్నం ఎండగా ఉన్నప్పటికీ.. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారింది. మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
తెలంగాణ కేడర్ కావాలని విజ్ఞప్తి చేసిన 11మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్రం నో చెప్పింది. ఈ 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలోనే రిపోర్టు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు డీఓపీటీ (DOPT) ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలి.. తనకు తెలంగాణ కేడర్ కావాలని కోరింది. దీనిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్ ను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్…
కల్తీ టీ పొడి తయారు చేసి దుకాణాలకు విక్రయిస్తున్న ముగ్గురు కల్తీ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ లోని ఫతేనగర్ కు చెందిన జగన్నాథ్ అనే వ్యక్తి కోణార్క్ టీ పౌడర్స్ సేల్స్ సప్లై పేరిట వ్యాపారం చేస్తున్నాడు. నాసిరకం టీ పొడిని కిలో రూ. 80 నుంచి 100కు కొనుగోలు చేస్తున్నాడు. ఆ పొడిలో కొబ్బరి పీచు, పంచదార పాకం, రసాయనాలు కలిపి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నాడు. దానిని కిలో రూ. 200 నుంచి 250 వరకు అమ్ముతున్నట్లు…
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ గుడ్ బై చెప్పాడు. గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు.