పూర్తి స్థాయిలో బీమా కవరేజీ అందించే టర్మ్ పాలసీలతో పాటు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (GST) నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గ ప్యానెల్‌లోని చాలా మంది సభ్యులు సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేలా పన్నులను తగ్గించడాన్ని సమర్థించారు. జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటుపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రుల బృందం శనివారం సమావేశమైంది. ఇందులో సీనియర్ సిటిజన్లు జీవిత బీమా, ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియం పన్ను నుండి మినహాయించే…
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్‌పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ బైకులకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు.. ఇండియాలో ఈ బైక్ లే దర్శనమిస్తాయి. అయితే.. మీరు కూడా భవిష్యత్తులో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగ పడుతుంది. కంపెనీ తన మోస్ట్-వెయిటింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650ని మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే.. గ్లోబల్ డెబ్యూకి ముందు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఫీచర్లు లీక్ అయ్యాయి.
అధిక కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. దాని ప్రభావం గుండె ఆరోగ్యంపై కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి గుండె జబ్బులు, గుండెపోటు వంటి తీవ్రమైన ప్రాణాంతక సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడూ చెక్ చేసుకుని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఔటయ్యాడు. దీంతో.. సెంచరీని మిస్ చేసుకున్నాడు. గత ఆరేళ్లలో పంత్ టెస్టుల్లో ఏడోసారి 90-99 రన్స్ మధ్య ఔటయ్యాడు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్.. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి నాలుగో వికెట్ కు అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి భారత్ ను కష్టాల నుంచి గట్టెక్కించాడు.
ప్రముఖ టెక్ కంపెనీ నోకియా లేఆఫ్‌లు ప్రకటించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ 2000 మందిని తొలగించింది. గ్రేటర్ చైనాలో నోకియా ఈ తొలగింపును చేసింది. అంతకుముందు ఖర్చులను తగ్గించుకునేందుకు యూరప్‌లో 350 మందిని కంపెనీ తొలగించింది. యూరప్‌లో ఉద్యోగుల తొలగింపులను కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు.
అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్ ఫోన్ కొనాలనే వారికి ఇదొక మంచి అవకాశం. అమెజాన్‌లో నడుస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి డీల్‌లో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. టెక్నో పోవా 5 ప్రో 5జీ (Tecno Pova 5 Pro 5G) బంపర్ తగ్గింపుతో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ.13,999 ఉంది. దీని సేల్‌పై 1500 రూపాయల కూపన్ తగ్గింపు ఇవ్వబడుతుంది. కూపన్ తగ్గింపుతో రూ. 12,499కే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. కాగా.. 462 పరుగులకు భారత్ ఆలౌటైంది. ఈరోజు 3 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతంగా ఆడారు. దీంతో.. భారత్ 107 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ (150), పంత్ (99) పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడి పరుగుల పట్టికను పరుగులు పెట్టించారు.
సరైన జీర్ణక్రియను నిర్వహించడం శరీరానికి చాలా ముఖ్యం. జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటే మన శరీరంలోని ఇతర అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలలో అతి ముఖ్యమైన సమస్యలు.. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, అపానవాయువు, మలబద్ధకం. ఈ సమస్యలు చాలా మంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రభావితం అవుతారు. ఈ జీర్ణ సమస్యలే కాకుండా మీ ఆరోగ్యాన్ని పాడుచేసే మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అవును.. తిన్న వెంటనే మలం విడుదల చేయాలనే కోరిక కూడా జీర్ణక్రియకు సంబంధించిన…
దాల్చిన చెక్కతో స్థూలకాయాన్ని, ముఖ్యంగా పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే సుగంధ ద్రవ్యం. దీనిలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ మసాలా ఆహార కోరికలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.