సెంచరీ సాధిస్తాడని అనుకున్న రిషబ్ పంత్ జస్ట్‌లో మిస్ అయింది. 99 పరుగుల వద్ద ఔటై అభిమానులను నిరాశపరిచాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో రాణించాడు. అంతకుముందు.. 150 పరుగులు చేసి ఔటైన సర్ఫరాజ్ ఖాన్ కూడా.. డబుల్ సెంచరీ సాధిస్తాడని అనుకున్నారు. కానీ అతను కూడా 150 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఏదేమైనప్పటికీ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శనివారం జరిగిన తొలి టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీ సాధించాడు. నాలుగో రోజు బెంగళూరు స్టేడియంలో 110 బంతుల్లో తొలి అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్.. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ క్రమంలో సెంచరీతో రాణించిన సర్ఫరాజ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యుముంబా, దబాంగ్ ఢిల్లీ తలపడ్డాయి. ఈ పోరులో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. 36-28 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. సీజన్ రెండో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది.
ప్రో కబడ్డీ సీజన్ 11 ఈరోజు ప్రారంభమైంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రో కబడ్డీ పోటీలు మొదలయ్యాయి. అయితే.. తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ మధ్య పోరు జరిగింది. ఈ పోరులో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది. 37-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. మొదటి మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది.
రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూప్-డి పోటీల్లో తమిళనాడు బ్యాటర్ సాయి సుదర్శన్ చెలరేగాడు. ఈ రోజు తమిళనాడు-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. గ్రూప్ డి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు ఒక వికెట్ నష్టానికి 379 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాటర్లలో సాయి సుదర్శన్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు.
సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీవీ ఉంటే.. మరి కొన్ని హర్రర్ ఇతరత్రా వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఎక్కువగా ఫన్నీ వీడియోలను చూడటానికే నెటిజన్లు ఇష్టపడతారు. కొన్ని నమ్మే రకంగా ఉంటే..మరి కొన్ని నమ్మశక్యం కానీ వీడియోలు ఉంటాయి. అయితే.. ఇటీవల, బీహార్ లో ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక పండు. ఈ పండును అనేక పేర్లతో పిలుస్తారు. అందమైన రంగుల కలయికతో కనిపించే ఈ పండు మధ్య అమెరికాలో ఎక్కువగా లభిస్తుంది. అయితే.. ప్రస్తుతం ఈ పండు చాలా చోట్ల దొరుకుతుంది. గత కొన్నేళ్లుగా ఈ పండ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పండును కట్ చేస్తే లోపల గుజ్జు ఉంటుంది. అందులో చిన్న గింజలు ఉంటాయి. ఇది తింటే.. పుల్లగా, తియ్యగా రుచిగా ఉంటుంది. ఈ పండులో ఉండే గుణాల కారణంగా దేశ, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లో గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 31 వరకు అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో అన్ని వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్ డీలర్-ఫిట్టెడ్ టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) ప్యాకేజీతో వస్తుంది. ధర రూ. 6.86-10 లక్షలు (ఎక్స్ షోరూం ఢిల్లీ).
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 9 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో.. కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించి ఈ ఘనత సాధించాడు. 42 ఓవర్లో విలియం ఒరోర్కే బౌలింగ్ లో సింగిల్ పూర్తి చేసి ఈ ఘనతను అందుకున్నాడు.
కబడ్డీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్.. తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మ్యాచ్‌తో లీగ్ మొదలవనుంది. దీంతో.. తెలుగు ప్రేక్షకులకు పండగే.. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.