Team India: టీమిండియాకు మరో షాక్.. కీలక బౌలర్‌కు గాయం..!
- భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు గాయం
- గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై స్పష్టత లేదు
- బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బౌలింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో శుక్రవారం జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. అయితే.. అతనికి గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై బీసీసీఐ అప్‌డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే.. మోకాలి గాయం కారణంగా రిషబ్ పంత్ ఆటకు దూరంగా ఉండటంతో టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెరిగింది. బుమ్రా వేలికి గాయమైనప్పటికీ.. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత బుమ్రా బౌలింగ్ చేశాడు. వేలి నుంచి రక్తం వచ్చినా.. చికిత్స అనంతరం బౌలింగ్ చేశాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 86వ ఓవర్‌లో లంచ్ తర్వాత ఫిజియో మైదానంలో కనిపించాడు. ఆ తర్వాత భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కామెంట్రీ సమయంలో ఫాస్ట్ బౌలర్ మధ్య వేలు కోసుకుపోయి రక్తస్రావం అవుతుందని చెప్పాడు. నొప్పితోనే బుమ్రా ఆ ఓవర్ పూర్తి చేశాడు. మళ్లీ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతని వేలికి టేప్‌తో కనిపించింది.
Read Also: TG Government : 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించిన తెలంగాణ సర్కార్
Also Read
తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం న్యూజిలాండ్‌తో రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (35), రోహిత్ శర్మ (52) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (19), సర్ఫరాజ్ ఖాన్ (13) పరుగులతో ఉన్నారు. 26 ఓవర్లలో 121/2 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 356 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?