బద్వేలులో ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో నిందితుడు విఘ్నేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు.
మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. దీంతో.. కివీస్ జట్టు 356 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 462 పరుగులు చేసి 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా.. 107 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో రెండు వికెట్లు…
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనుంది ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ 107 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా సాధించింది. దీంతో.. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ విజయాన్నందుకుంది. గెలుపు అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టాస్ ఓడిపోవడం వల్లే భారత్‌తో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని అన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని తెలిపాడు.
ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లోపు తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, అక్టోబర్ 22 ఉదయం నాటికి వాయుగుండంగా, అక్టోబర్ 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది.
ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కృష్ణా-గుంటూరు, తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవులు 2025 మార్చితో ముగుస్తాయి. ఈ క్రమంలో.. ఈ రెండు స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.
కడప ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ x వేదికగా స్పందించారు. 'లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం @ncbn గారూ? మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదో చోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉంది. ఒక…
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. 44-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఈ సీజన్ తన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది.