వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అయితే.. ఈ పర్యటనలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ టూర్‌లో పాల్గొంటాడా లేదా అనేది అనుమానాలు ఉండేవి. అయితే.. వాటికి షమీ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన ఫిట్‌నెస్‌పై షమీ స్వయంగా అప్‌డేట్ ఇచ్చాడు. తాను నొప్పి నుంచి పూర్తిగా విముక్తి పొందానని, ఆస్ట్రేలియా టెస్టు పర్యటనకు దూరం కానని చెప్పాడు.
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసి)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారతదేశం-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. గత కొన్ని వారాలుగా దౌత్య, సైనిక స్థాయిలో భారతదేశం-చైనా మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తాము చైనాతో సమస్యలపై ఒక ఒప్పందానికి వచ్చామని చెప్పారు.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్-సౌతాఫ్రికా మధ్య జరిగింది. టైటిల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 32 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్ అవతరించింది.
2023లో వచ్చిన మిచాంగ్ తుపాను ప్రభావానికి కాకినాడ జిల్లాలో పలు సాగునీటి కాలువలు, కట్టలు, గేట్లు, పూడికతీత వంటి సమస్యలు ఏర్పడ్డాయి. తుపాను తగ్గిన వెంటనే ఈ నష్టానికి సంబంధించి జిల్లా అధికారులు 288 ఇరిగేషన్ పనులు వెంటనే చేయాలని ప్రతిపాదనలు అప్పటి ప్రభుత్వానికి పంపారు. నాటి ప్రభుత్వం ఆ పనులను కనీసం పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. తాజాగా ఏలేరు రిజర్వాయర్‌కు వరద వచ్చినపుడు బాధిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన జరిపినప్పుడు సాగు నీటి పనులకు సంబంధించిన గతంలో పంపిన ప్రతిపాదనలను అధికారులు డిప్యూటీ…
పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని మంత్రి వెల్లడించారు.
వైద్య ఆరోగ్య శాఖ, స్థానిక వైద్య సిబ్బంది పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా అదుపులోకొచ్చిందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆయన వివరాలతో కూడిన సమాచారం అందించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డయేరియా ప్రబలిన వెంటనే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతిని విజయనగరం జిల్లాకు హుటాహుటిన పంపించామనీ, అక్కడే ఉండి పరిస్థితిని ఆమె పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మాదాలవారి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లి గల్లంతు అయ్యారు. మొత్తం ఏడుగురు బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు చెరువులోకి సరదాగా స్నానానికి వెళ్లారు. సెల్ఫీల మోజులో పడి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో పాలడుగు దుర్గారావు, జే. వెంకటేష్ గా గుర్తించారు. మరో ఐదుగురు విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.
ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపునకు ఆయన ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలని పవన్ తెలిపారు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. కివీస్‌తో జరిగే రెండో, మూడో టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించింది. ఇందులో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించింది.