స్పీకర్ ఛాంబర్, మండలి భవనం మరమ్మతులపై మంత్రులు సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్‌లు రామచంద్ర నాయక్, ఆది శ్రీనివాస్, రహదారులు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన పనులపై స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు రివ్యూ చేశారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల నాటికి మర్మతులు పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు. దాదాపు గంటన్నరపాటు ఈ సమావేశం కొనసాగింది. అనంతరం.. అసెంబ్లీలో పాత భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.
Read Also: CM Chandrababu: 15 రోజుల్లో డ్రోన్ పాలసీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రూ. 49 కోట్ల అంచనాతో అఘాఖాన్ ట్రస్ట్ అసెంబ్లీని రెనోవేట్ చేస్తుందన్నారు. 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎంకు చెప్పమని చెప్పారు.. నిజాం తరహాలో ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నారు.. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు అసెంబ్లీ నుండి కౌన్సిల్‌కు వెళ్లాలంటే వెహికిల్‌లో సీఎం మంత్రులు వెళ్లాల్సి వస్తుంది.. ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుందని చెప్పారు.
Read Also: IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. మహ్మద్ సిరాజ్‌పై వేటు!
అనంతరం.. కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ ఛార్జీల అంశంపై ERC దగ్గరకు వెళ్ళటం పెద్ద జోక్ అని దుయ్యబట్టారు.. కేటీఆర్ జోకర్ అని విమర్శించారు. పార్లమెంట్‌లో ఒక్క సీటు రాకున్నా.. అసెంబ్లీలో ఓడించిన బుద్ధి రాలేదన్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పేద వాళ్ళకు తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు. కేంద్రమంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంత నిధులు తెచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.