HYDRA: చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా ఫోకస్..
- హైదరాబాద్ లో పునరుజ్జీవనంపై హైడ్రా దృష్టి
- భవనాల శిథిలాలను తొలగించే పనిలో అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగర పరిధిలోని చెరువల ఆక్రమణలను తొలగించిన హైడ్రా ఇప్పుడు.. ఆయా చెరువుల పునరుజ్జీవనంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతీనగర్‌కు చేరువలో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఈ చెరువులో 5 అంతస్తుల 3 భవనాలను ఆగస్టు 14న హైడ్రా కూల్చివేతలు జరిపిన విషయం తెలిసిందే. కూల్చివేతలు అనంతరం నిర్మాణానికి వాడిన ఐరన్‌తో పాటు, ఉపయోగపడే ఇతర సామగ్రిని నిర్మాణదారుడు తీసుకొని వెళ్ళగా.. మిగతా వ్యర్థాలను తొలగించకపోవటంతో, నిర్మాణదారుడికి హైడ్రా నోటీసులు జారీ చేసింది.
Read Also: UP: ఒకే మైనర్ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి
Also Read
ఎర్రకుంటలో గుట్టలుగా పడి ఉన్న నిర్మాణ వ్యర్థాలను పూర్తిగా తొలగించే పనులను హైడ్రా అధికారులు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లో పనులు పూర్తి చేయనున్నారు. నిర్మాణ వ్యర్థాలను తరలించిన తరువాత హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు చెరువుకు పునరుజ్జీవనం కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే.. నగరంలోని మిగతా చెరువుల్లో కూల్చివేసిన భవనాల వ్యర్థాలను కూడా త్వరలో తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. అన్ని చెరువుల్లో పురుజ్జీవనం పనులు చేపట్టనున్నారు.
Read Also: Eatala Rajendar: హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!