దాదాపు ఏడాది పాటు టీమిండియాకు దూరమైన మహ్మద్ షమీ ఆటను చూడాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. రంజీ ట్రోఫీలో ఆడనున్న షమీ.. తదుపరి రెండు రౌండ్ల మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దేశవాళీ రెడ్ బాల్ టోర్నమెంట్‌లో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లతో జరిగే తదుపరి రెండు మ్యాచ్‌ల బెంగాల్ జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కలేదు. 34 ఏళ్ల షమీ వన్డే ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరుగునున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా ఆడటం కష్టంగానే కనిపిస్తోంది.
Read Also: Uttarakhand: 36కు చేరిన అల్మోరా ప్రమాద ఘటన మృతుల సంఖ్య.. పీఎం, సీఎం సంతాపం
అయితే.. ఇటీవలే తాను ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్తానని షమీ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ముందు రంజీ మ్యాచ్‌ల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మహ్మద్ షమీకి ఫిబ్రవరిలో లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. అయితే.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆడాలనుకున్నప్పటికీ.. మోకాలి వాపు కారణంగా అతను రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. అంతకుముందు బెంగాల్ కోచ్ లక్ష్మీ రత్న శుక్లా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా టూర్‌కు షమీ తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడని అన్నారు. అక్కడ పాల్గొనే ముందు.. రంజీ ట్రోఫీ ఆడి పట్టు సాధించాలని కోరుకుంటున్నాడని తెలిపారు. అయితే షమీ పునరాగమనం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదని పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష