పసికందును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌లో జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్‌లో ఓ పెళ్లి వేడుక అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకు అదృశ్యమవడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రేమ వివాహంకు అంగీకరించిన పెద్దలు.. రేపు పెళ్లికి సిద్ధం చేసిన ఇరు కుటుంబ సభ్యులు. అయితే.. పెళ్లి కొడుకు పత్తా లేకుండా పోవడంతో రేపు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది.
మూసీ ప్రక్షాళన అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సాక్షాత్తు సీఎం తమ ప్రాంతానికి వస్తుండటంతో మూసీ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతాయని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మూసీ నదిని శుద్ధి చేసి తమ ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
కాంగ్రెస్ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బై వన్, గేట్ వన్ రాజకీయాలు బీజేపీ పాలనలో ఉండవని అన్నారు. దేశ సంపద ముస్లింలకు మాత్రమే పంచి పెట్టాలనే మూల సిద్ధాంతం కాంగ్రెస్‌ది అని ఆరోపించారు.
అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. అలాగే.. 4,141 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి పత్తిని దిగుమతి చేయవద్దని, మన దేశంలోనే సరిపడా పత్తి నిల్వలు ఉన్నాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విదేశాల నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసి రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన చేయాల్సిందే... నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నుండి తీసుకువచ్చిన అభ్యంతరం లేదని తెలిపారు. ఒక్క ఇల్లు కూలగొట్టిన ఊరుకునేది లేదు.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరఫు లాయర్ రేపు వాదనలు వినిపించనున్నారు. ఈరోజు విచారణలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ప్రభుత్వా విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీలు, బలరాం నాయక్, కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని అన్నారు.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ-రేసింగ్‌పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోటర్ కార్ల రేసింగ్ క్రీడ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన క్రీడ అని అన్నారు. ఫార్ములా -1 మొదటి రేసింగ్ 1946లో ఇటలీలో జరిగిందని తెలిపారు. ఈ ఫార్ములా వన్ 24 రేసింగ్‌లు నిర్వహిస్తుంది.. భారతదేశం కూడా ఫార్ములా వన్ రేసింగ్ నిర్వహించేందుకు ఎదురు చూసిందని పేర్కొన్నారు.