నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో మన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం మన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కానీ మనం ఎక్కువగా కెమికల్స్‌తో కూడిన జంక్ ఫుడ్స్ తింటున్నాం. ఈ క్రమంలో.. అవి మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో.. మన శరీరం అనేక వ్యాధుల బారిలో పడుతుంది. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా అనారోగ్యకరమైన ఆహారాలు, ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.
ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మరోసారి కొన్ని అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఇవి తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపి రోగాల బారిన పడుతున్నారు. ఇంతకీ.. డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన జాబితాలో అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలు తినడం వల్ల వచ్చే రోగాల గురించి తెలిపింది. అవి.. ఊబకాయం, గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం అని చెప్పింది. ఈ క్రమంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి.. మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించింది. డబ్ల్యూహెచ్‌వో జారీ చేసిన అనారోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఏవీ ఉన్నాయో తెలుసుకుందాం..
Election Commission: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల
ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం మానుకోండి:
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన అనారోగ్యకరమైన ఆహార పదార్థాల జాబితాలో ప్రాసెస్ చేసిన మాంసం ఉంది. అలాగే.. సాసేజ్, హామ్, బేకన్ మొదలైన ప్రాసెస్ చేసిన మాంసాలను తినొద్దని సూచించింది. వాటిలో సోడియం అధిక మొత్తంలో ఉంటుంది. అంతే కాకుండా రసాయనాల సాయంతో ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వాటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్, ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
చక్కెర కలిపిన పానీయాలు:
చక్కెర మిశ్రమ పానీయాలలో అధిక కేలరీలు ఉంటాయి. ఇది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సోడా, ఎనర్జీ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. వీటికి బదులు నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
ట్రాన్స్ ఫ్యాట్:
మన శరీరంలో కొలెస్ట్రాల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందు కోసం ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ వినియోగానికి దూరంగా ఉండాలి. ఇవి తింటే.. కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
తెల్ల ఉప్పు:
అయోడిన్ సరఫరా చేయడానికి ఉప్పు ఉపయోగిస్తారు. అయోడిన్ శరీరానికి చాలా ముఖ్యమైనది. అందుకోసం.. డబ్ల్యూహెచ్‌వో ఇటీవల రోజుకు 5 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదని సూచించింది. ఎందుకంటే ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.