మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, ప్రభుత్వా విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎంపీలు, బలరాం నాయక్, కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారని అన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల 19 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.. ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం మీద బావ బావమరిది తప్పుడు ప్రచారు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యక్షంగా రైతుల కోసం ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు రుణమాఫీ చేశాం.. మిగతా 12 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. బావ బావమరిది తల ఎక్కడ పుట్టుకుంట్టారో అప్పుడు చెప్పుతామని అన్నారు.
Central America: గాల్లో ఉన్న విమానం డోర్ తెరిచేందుకు యత్నించిన వ్యక్తి.. ఏం జరిగిందంటే? (వీడియో)
పేదల పక్షపాతి ప్రభుత్వం కాబట్టి రైతుబంధు కొంచెం ఆలస్యమవుతుందని మంత్రి అన్నారు. తాము ఇచ్చే స్మార్ట్ కార్డు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి అని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిలో విదేశాల సంస్థలకు ఇచ్చిన భూమిని మళ్ళీ తీసుకొస్తున్నాం.. దేశంలో ఎక్కడ లేనటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. తప్పు చేస్తే పేదవాడి సొమ్మును కొల్లగొడితే పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. గుమ్మడికాయ దొంగ అంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నావో చెప్పాలన్నారు. నీవు ఎందుకు పాదయాత్ర చేస్తున్నావో ప్రజలకు చెప్పాలని తెలిపారు. మనిషిని మనిషిలా గౌరవించని మీరు.. పదవిపోయే సరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
YS Jagan: డిప్యూటీ సీఎం పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
చట్టానికి తెలుసు.. ఎప్పుడు, ఎక్కడ ఏమి జరగాలో తెలుసు.. త్వరలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏది ఏమైనా ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి డిసెంబర్ నాటికి మిగతా 13 వేల కోట్లు ఇచ్చి తిరుతామని పేర్కొన్నారు. అప్పుడు మీరు ఏ టైరు కింద తలపెట్టలో మీరే నిర్ణయించుకోండని బీఆర్ఎస్ ను దుయ్యబట్టారు. రైతులకిచ్చిన మాటని తుచ తప్పకుండా చేస్తామన్నారు. రైతన్నలకి, నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల వరకు కొత్త పింఛన్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అన్ని పథకాలు ఇచ్చి తీరుతామని మంత్రి పొంగులేటి తెలిపారు.