Beauty Tips: ఈ ఆకులను ఇలా వాడితే ముఖంలో ఎంతో గ్లో..
- అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి తులసి ఆకులు చాలా ఉపయోగం
- తులసి ఆకులు మొటిమలను తగ్గిస్తాయి
- తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
- చర్మాన్ని కాంతివంతంగా మార్చి ఛాయను మెరుగుపరుస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లైతే మెరిసే, మచ్చలేని చర్మం ఉండాలనుకుంటారు. అందుకోసమని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి డబ్బులు వృధా చేసుకోవడం తప్ప ఏముండదు. అంతేకాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈ క్రమంలో సురక్షితమైన, ఆర్థిక, సమర్థవంతమైన మార్గం ఇంట్లో ఉండే వస్తువులను ఉపయోగించడం. మీ ఇట్టి పరిసరాల్లో ఉండే తులసి మొక్క మీ ముఖాన్ని అందంగా చేయగలదు. తులసి ఆకు మీ అందాన్ని పెంచడంలో సహాయపడుతుంది. తులసి ఆకు వల్ల జరిగే ప్రయోజనాలు.. దానిని ఉపయోగించే విధానం ఎలాగో తెలుసుకుందాం.
Kakinada Subbayya Gari Hotel: సుబ్బయ్య గారి హోటల్ భోజనంలో జెర్రీ.. సీజ్ చేసిన అధికారులు
Also Read
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
తులసి చర్మానికి చాలా ప్రయోజనం:
అందమైన మెరిసే చర్మాన్ని పొందడానికి తులసి ఆకులు చాలా సహాయపడతాయి. తులసిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంలో చాలా ఉపయోగ పడుతాయి. తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చి ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా.. తులసిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి ఫైన్ లైన్స్, ముడతలు వంటి అకాల వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది.
తులసితో ప్రకాశవంతం చేసే ఫేస్ ప్యాక్:
మీరు తులసి ఆకులతో మీ ముఖం కాంతివంతం చేసే ఫేస్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. అందు కోసం తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఒక చెంచా తులసి పౌడర్‌లో చిటికెడు పసుపు కలిపి.. దానికి పెరుగు, రోజ్ వాటర్, తేనె కలిపి పేస్ట్ తయారు చేయాలి. దీన్ని వారానికి రెండుసార్లు చర్మానికి పూయడం వల్ల మీ చర్మం మునుపటి కంటే కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా.. పిగ్మెంటేషన్, చిన్న మచ్చలు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
తులసి నుండి టోనర్ తయారు చేయండి:
చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలంటే ముఖం కడుక్కున్న తర్వాత టోనర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. మార్కెట్లో దొరికే టోనర్‌కు బదులుగా.. తులసి నుండి అద్భుతమైన టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని రెడీ చేయడానికి ఒక గ్లాసు నీటిలో 10 నుండి 12 తాజా తులసి ఆకులను వేసి మరిగించాలి. ఈ నీరు సగానికి తగ్గగానే స్ప్రే బాటిల్‌లో నింపి నిల్వ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ముఖాన్ని కడిగి స్ప్రే చేయాలి. మెరిసే చర్మానికి ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ.
మొటిమల కోసం స్పాట్ రిడక్షన్ ప్యాచ్ చేయండి:
మీ ముఖంపై మొటిమలు ఉంటే.. వీలైనంత త్వరగా వాటిని వదిలించుకోవాలనుకుంటే తులసి ఆకులను ఉపయోగించవచ్చు. కొన్ని తాజా ఆకులను మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకుని.. అందులో చిటికెడు పసుపు వేసి మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి. దీంతో.. చాలా త్వరగా ప్రయోజనాలను చూస్తారు.
తులసి నుండి యాంటీ యాక్నే జెల్ తయారు చేయండి:
తులసి ఆకుల నుండి యాంటీ-యాక్నే జెల్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. అందు కోసం.. తులసి ఆకుల తాజా పేస్ట్‌ను తయారు చేసి, ఒక చెంచా అలోవెరా జెల్‌తో కలపాలి. దానిని రాత్రిపూట ముఖం కడుక్కుని ఉపయోగించాలి. ఇది మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందడంలో మీకు చాలా సహాయపడుతుంది.
తులసి ఆకులతో శీఘ్ర సౌందర్యం:
ప్రతిరోజూ ఉదయం ముఖానికి తులసి ఆకులను కూడా రుద్దవచ్చు. ఇది సులభమైన, చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇలా రోజూ చేయడం వల్ల క్లీన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. దీనితో పాటు.. మీరు ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను కూడా నమలితే ఆరోగ్యం, చర్మం రెండింటికీ మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!