Drunk and Drive: వీరంగం సృష్టించిన మందుబాబు.. పోలీసులతో వాగ్వాదం
- హైదరాబాద్ పాతబస్తీ-చంపాపేట్ ప్రధాన రహదారిలో ఓ యువకుడు బీభత్సం ఏకంగా పోలీసులపై తిరగబడి నానా హంగామా సృష్టించిన మందుబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మత్తులో మునిగితే ప్రపంచాన్నే మరిచిపోతారు కొందరు.. ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం.. మన వల్ల పక్కవాళ్ల ఇబ్బంది పడుతున్నారేమో అని కనీస విచక్షణ కూడా ఉండదు అలాంటివాళ్లకు. దానికి తోడు ఈ మధ్య మద్యం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు కలిగించే వాటిని సేవించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వాటికి బానిసలు అవుతున్న వారి సంఖ్య మరింత ఎక్కువైంది. ఇక్కడ కూడా సరిగ్గా అలాగే ఓ గంజాయి మహానుభావుడు చేసిన నిర్వాకం చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు.
Read Also: Biggboss 8 : ఆఖరి ఘట్టానికి చేరుకున్న బిగ్ బాస్.. ఫైనలిస్ట్ కంటెస్టెంట్స్ వీళ్లే
Also Read
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
హైదరాబాద్ పాతబస్తీ-చంపాపేట్ ప్రధాన రహదారిలో ఓ యువకుడు చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఏకంగా పోలీసులపై తిరగబడి నానా హంగామా సృష్టించాడు మందుబాబు. ఫుల్లుగా గంజాయి సేవించాడు. ఇంకేముంది.. ఎవడు నాకు అడ్డు అన్నట్లుగా నడిరోడ్డుపైనే దుకాణం పెట్టేశాడు. వచ్చిపోయే వాహనాలను ఆపుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. అంత ట్రాఫిక్ మధ్య అతనికి ఏమైనా జరుగుతుందేమో అని మనం భయపడడం తప్ప.. ఆ మహానుభావుడు మాత్రం భయం లేకుండా రోడ్డుపై హైడ్రామా క్రియేట్ చేశాడు. కాసేపు కింద కూర్చుంటాడు.. కాసేపు లేచి అటు ఇటు తిరుగుతాడు. అంతటితో ఆగకుండా బస్సు, కారు, బైకు అనే తేడా లేకుండా అడ్డం వచ్చిన అన్ని వాహనాలను నిలువరిస్తూ నానా హంగామా సృష్టించాడు.
Read Also: Mulugu: ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు వెల్లడి..
పోనీ ఎవరైనా నచ్చజెప్పినా వినే పరిస్థితిలో అతను లేనట్లు తెలుస్తోంది. అందుకే ఎవరికి ఎంత ఇబ్బంది కలిగించినా.. ఆ వ్యక్తి కంట పడకుండా మెల్లగా అక్కడ నుంచి జారుకోవడం తప్ప చేసేదేమీ లేదనుకున్నారేమో.. ఎవ్వరు కూడా అతన్ని ఆపి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఫలితంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో పాటు చాలా మంది వాహనదారులు ఇబ్బందుల పాలయ్యారు. పైగా అక్కడ ఉండి కట్టడి చేయాల్సిన ట్రాఫిక్ సిబ్బంది కూడా కనబడకపోవడం గమనార్హం. అందుకే ఆ గంజాయి మహానుభావుడు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా కనిపించిది అక్కడ పరిస్థితి..
తాజావార్తలు
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?