Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshay Kumar: క్లైమాక్స్ అనేది ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి క్లైమాక్స్ లేకుండానే ఒక సినిమా విడుదలైందంటే నమ్మడం కాస్త కష్టమే. కానీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఓ సినిమాకి అలాంటి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అంతేకాదు, ఆ సినిమాలో ఆయనతో కలిసి నటించింది సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి శ్రీదేవి కావడం విశేషం. తాజాగా అక్షయ్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో మరోసారి ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అక్షయ్ కుమార్, తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. తన తొలి సెలబ్రిటీ క్రష్ శ్రీదేవి అని ఆయన వెల్లడించారు. దాంతో హోస్ట్ కరణ్ జోహార్, ఇద్దరూ కలిసి నటించిన ‘మేరీ బీవీ కా జవాబ్ నహీ’ సినిమాను ప్రస్తావించారు. అప్పుడే ఆ సినిమా వెనుక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అక్షయ్ బయటపెట్టారు. ఆ సినిమా విడుదల కాలేదా అని కరణ్ ప్రశ్నించగా, అక్షయ్ స్పందిస్తూ విడుదలైందని, కానీ క్లైమాక్స్ ను చిత్రీకరించకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలిపారు. సినిమాలో చివరి భాగంలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పే సన్నివేశం వరకు మాత్రమే షూటింగ్ జరిగిందని, కానీ రివేంజ్ తీర్చుకునే క్లైమాక్స్ మాత్రం షూటింగ్ అసలు జరగనేలేదని చెప్పారు. చివరికి సినిమాలో ‘ఆ తర్వాత వాళ్ళు ప్రతీకారం తీర్చుకున్నారు’ అనే ట్యాగ్ తో కథను ముగించారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఇలాంటి అనుభవం మరొకటి లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
పంకజ్ పరాశర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్.ఎం. ఇక్బాల్ నిర్మించారు. అక్షయ్ కుమార్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, గుల్షన్ గ్రోవర్, అనుపమ్ ఖేర్, జానీ లివర్, లక్ష్మీకాంత్ బెర్డే, కిరణ్ కుమార్, నీనా గుప్తా, జయశ్రీ టి., జగదీష్ రాజ్, బ్రిజ్ గోపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 1994లోనే షూటింగ్ పూర్తయినప్పటికీ, పలు కారణాలతో దాదాపు పదేళ్ల పాటు విడుదల కాలేదు. చివరకు 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాదు, ఈ చిత్రం 1992లో విడుదలైన తెలుగు హిట్ మూవీ ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’కు రీమేక్‌గా రూపొందింది. అక్షయ్ కుమార్, శ్రీదేవి కలిసి నటించిన ఏకైక చిత్రంగా కూడా ఇదే కావడం విశేషం.
- Tags
- Akshay Kumar
- cinema
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!