Congress : అన్నా చెల్లి మధ్యలో లొల్లి.. ఆ పార్టీలో వారిగురించే చర్చ నడుస్తోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పుడు పీజేఆర్ బలమైన నాయకుడు. ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉండేది. పార్టీలో హైదరాబాద్ ప్రస్తావన వస్తే.. పీజేఆర్ పేరు చర్చకు వచ్చేది. పీజేఆర్ మరణం తర్వాత ఆ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి. ఎమ్మెల్యేగానూ చేశారు. గత రెండు ఎన్నికల్లో నెగ్గుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వైసీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరి రెండుసార్లు GHMC కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే అధికారపార్టీలో తనకు తగిన గుర్తింపు.. గౌరవం లేదని భావించిన ఆమె.. ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఆ విధంగా అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు అయ్యింది. కానీ.. విజయారెడ్డి చేరికపై విష్ణువర్థన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య రాజుకుంది.
విజయారెడ్డి చేరిక సమయంలోనే కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పీజేఆర్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి ఆమె రాకను స్వాగతించారనే చర్చ నడిచింది. కానీ.. ఆ తర్వాతే పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత రెండు ఎన్నికల్లో ఓడిన విష్ణు..కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా లేరు. దీనిపై కేడర్ కూడా అసంతృప్తితో ఉందట. విజయారెడ్డి రాకతో అన్నకు చెల్లి నుంచే పోటీ అని ప్రచారం మొదలైంది. దీంతో విష్ణు పావులు కదపడం మొదలు పెట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యి చర్చించారు. ఇక్కడే ఇంకో గమ్మత్తు ఉంది. విజయారెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ల చేర్చుకుంటే.. విష్ణు వెళ్లి ఆ అంశంపై సీఎల్పీ నేత భట్టితో మాట్లాడారు. దీంతో కొత్త వాళ్లు రేవంత్‌తో.. పాత వాళ్లు పాత నాయకులతో భేటీ అవుతున్నారనే చర్చ జరుగుతోంది.
Also Read
తాజాగా విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ నేతలను భోజనానికి పిలిచారు. అది కూడా చర్చగా మారింది. భోజనానికి రావాలని రేవంత్ టీమ్‌కు కూడా విష్ణు ఆహ్వానం పంపారట. అయితే ఆ విందు సమావేశం రచ్చ రచ్చగా మారపోయింది. ప్రస్తుతం అన్నా చెల్లి మధ్య రేగిన ఈ సమస్యను పార్టీ ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. జూబ్లీహిల్స్.. ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పీజేఆర్ అంటే స్థానికులకు అభిమానం ఉంది. ఆ అంశాన్ని దృష్టిలో పెటుకుని సమస్యను కొలిక్కి తేవాలన్నది పార్టీ వర్గాల మాట. పార్టీలో సీనియర్ నాయకులు సైతం విష్ణుతో భేటీ అవుతున్నారు. మరి.. అన్నా చెల్లి మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!