YCP :ఒక్కో వైసీపీ నేతకు ఒక్కో మండలం..అవినీతికి లైసెన్స్ ఇచ్చేశారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో భూములకు డిమాండ్ ఎక్కువ. నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు.. కోవూరు.. విడవలూరు మండలాల్లో గ్రావెలతోపాటు ఇసుక అధికంగా లభిస్తుంది. ఇవే స్థానిక వైసీపీ నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం సైతం ప్రస్తుతం చర్చగా మారింది. అధికారపార్టీ వర్గాల్లోనే కుమ్ములాటలకు.. వర్గపోరుకు.. కేడర్‌కు ఎమ్మెల్యేకు మధ్య దూరం పెరగడానికి కారణమైందని చెబుతున్నారు.
కోవూరు నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ నేతలను ఇంఛార్జులుగా నియమించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌రెడ్డి. వారికే పూర్తి బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆ నాయకులు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటూ సమస్యలు సృష్టిస్తున్నారని పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. మూడేళ్లుగా ఇదే జరుగుతున్నా ఎమ్మెల్యే లైట్ తీసుకుంటున్నారట. కొడవలూరులో DCMS అధ్యక్షుడు చలపతిరావు చెప్పిందే వేదంగా మారిపోయిందట. అక్కడేం జరగాలన్నా చలపతిరావు అనుమతి కావాలని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇటీవల మండలంలో గ్రావెల్ తవ్వకాలపై వైసీపీలో వర్గపోరు మొదలైంది. సమస్య ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. అన్నీ విన్న ప్రసన్నకుమార్‌రెడ్డి ఏదీ పట్టించుకోలేదట.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
విడవలూరు మండలంలో వైసీపీ నేతల మధ్య పంపకాల్లో తేడాలు వచ్చాయట. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేశారని గుప్పుమంది. ఆ సంఘటనపై మాత్రం ప్రసన్న కుమార్‌రెడ్డి భగ్గుమన్నారు. ఇందుకూరుపేట మండలంలో పార్టీ నేతలు శ్రీనివాసరెడ్డి, ఆదిశేషారెడ్డిలపై మరో నేత సురేష్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నేతల అవినీతి చిట్టా బయటపెడతానని సురేష్‌రెడ్డి చెప్పడంతో కలకలం రేగింది. కొందరు నాయకులైతే.. జనాల్లో డ్యామేజీ అవుతోందని భావించి.. నేరుగా ఎమ్మెల్యే దగ్గర పంచాయితీ పెట్టారట. పార్టీలో వారైనా ఉండాలి లేదాంటే మేమైనా వెళ్లిపోతామని తెగేసి చెప్పారట.
బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వైసీపీ నేత సూరా శ్రీనివాసరెడ్డి సర్వం తానై వ్యవహరిస్తున్నారట. ఇక్కడ ఇసుక, గ్రావెల్ తవ్వకాలపై నిత్యం తగువే. కొందరు కోట్లు గడించారని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. పైగా వైసీపీకి మొదటి నుంచి పనిచేస్తున్న వారిని కాదని.. కొత్తగా వచ్చిన వారికి ఎలా పెత్తనం ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. అయితే ఎమ్మెల్యేకు స్నేహితుడిగా ఉన్న తనను ఎవరూ ఏమీ చేయలేరని ఒక నాయకుడు చేస్తున్న ప్రకటనలు కేడర్‌ను దిక్కతోచని స్థితిలో పడేస్తున్నాయి. ఈ మండలంలో జరుగుతున్న వ్యవహారాలను కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక కోవూరు మండలంలోనూ ఇదే పరిస్థితి ఉందట. అక్కడా వాటల కోసం పార్టీ నేతలు గొడవలు పడుతున్నారు.
మొత్తానికి ఒక్కో మండలాన్ని ఒక్కో నేతకు అప్పగించి.. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఏదీ పట్టించుకోవడం లేదనే వైసీపీ కేడర్ గుర్రుగా ఉంది. తనకు కావాల్సిన వాళ్లకు మండలాలు రాసిచ్చేసి.. అక్కమార్జనకు లైసెన్స్ ఇచ్చారని పార్టీ నేతలే వాపోతున్నారు. సొంత పార్టీ వాళ్లకే మామూళ్లు ఇచ్చుకోవాల్సి వస్తోందని కేడర్ గగ్గోలు పెడుతోంది. అన్నీ తెలిసిన ఎమ్మెల్యే ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదట.
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..