తెలంగాణలో మరోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయా? దీనిపై గతంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఏంటి? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ముఖ్యమంత్రి ప్రకటనలో నర్మగర్భ సంకేతాలు ఉన్నాయా? రాజకీయ వాతావరణం కలిసి వస్తే ముందస్తుకు సై అంటారా? ఈ వ్యాఖ్యలపైనే తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అని అంతా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. సీఎం […]
నవరత్నాలే హామీలుగా అధికారంలోకి వచ్చిన జగన్.. ఆర్థిక కష్టాలు ఉన్నా.. తుచ తప్పకుండా స్కీముల అమలు చేస్తున్నారు. సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభివృద్ధి సంగతేంటనే విమర్శలు వచ్చినా.. బిల్డింగులు కాదు.. మానవాభివృద్ధే అసలు అభివృద్ధి అనే నినాదం ఎత్తుకున్నారు జగన్. ఏపీ లోటు బడ్జెట్ కు, జగన్ ఇచ్చిన హామీలకు పొంతన లేదన్న అభిప్రాయాల మధ్య జగన్ పాలన మొదలైంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే మొత్తం మ్యానిఫెస్టోనూ అమలు చేశామని, చెప్పనివి […]
తూర్పు జయ ప్రకాష్‌రెడ్డి. ఈ పేరుకంటే జగ్గారెడ్డిగానే అందరికీ పరిచయం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. కొద్దిరోజులుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంటే కయ్ మంటున్నారు. ఇటీవల పార్టీలో క్రమశిక్షణ తప్పిన ఎవరినైనా.. గోడకేసి కొడతానని రేవంత్ అనడంతో.. అంతే స్థాయిలో భగ్గుమన్నారు జగ్గారెడ్డి. గోడకేసి కొట్టడానికి నువ్వెవడివి అని నేరుగానే రేవంత్‌కు గురిపెట్టారు. ఆ వివాదం కాంగ్రెస్ పొలిటికల్ టెంపరేచర్‌ను అమాంతం పెంచేసింది. చివరకు వివాదం అటు తిరిగి.. ఇటు తిరిగి […]
రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దేశంలోని ప్రధాన పార్టీలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు దేశాధ్యక్షుడి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయం తీసేసుకున్నాయి. కానీ.. ఇప్పటి వరకు టీడీపీ నిర్ణయం ఏంటన్నది బయటకు రాలేదు. పార్లమెంటులో.. అసెంబ్లీలో పెద్దగా ప్రభావం చూపని స్థితిలో టీడీపీ సభ్యులు ఉన్నారు. జగన్‌కు జైకొట్టగా మిగిలిన 20 మంది ఎమ్మెల్యేలు.. ముగ్గురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశానికి ఉన్నారు. […]