ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన రుణం మంజూరు చేయాలో, వద్దో నిర్ణయించడం… ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండుమూడు వారాల సమయం పట్టేది. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే […]
వారసుడిని చట్టసభల్లోకి పంపాలని చూస్తున్నారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ విన్నపాన్ని పార్టీ పెద్దలు పట్టించుకుంటారో లేదో తెలియదు. ఇంతలో మరో నాయకుడు అక్కడ కర్చీఫ్ వేసేందుకు పావులు కదుపుతున్నారట. ఈ ఎత్తుగడల మధ్య అధికారపార్టీ రాజకీయాలపై చర్చ స్పీడందుకుంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్..! ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి అక్కడ పార్టీకి గట్టి పునాదులే వేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే […]
పదవులు ఇస్తే కొందరు సంతృప్తి చెందుతారు. మరికొందరు ఆ పదవులతో కొత్త ఎత్తులు వేస్తారు. టీఆర్ఎస్లో కొందరు నాయకులు రెండో పద్ధతిని ఎంచుకున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా మారినట్టు టాక్. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని తలపట్టుకుంటున్నారట ఎమ్మెల్యేలు. తెలంగాణ ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్… వివిధ కారణాలతో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి.. ఆ తర్వాత కొత్తగా టీఆర్ఎస్లో చేరిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తూ వస్తోంది […]
డిఫెన్స్ పడ్డ ఆ ఎమ్మెల్యే.. సెల్ఫ్‌గోల్ చేసుకున్నారా? ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీన్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అప్రమత్తంగా వ్యహరించారా? రోజంతా హైడ్రామా నడిచిన వ్యవహారంలో కొండను తవ్వి ఎలుకను పట్టుకుంది ఎవరు? పోలీస్ స్టేషన్లో నేలపై పరుపు వేసుకుని నిద్ర పోతున్నది ఎవరో కాదు.. కోనసీమ జిల్లాలోని కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి. ఈ సీన్‌కు వేదిక రావులపాలెం పోలీస్ స్టేషన్. రెండు […]
మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు. ఎవరి కుంపటి వారిదే. అధిష్ఠానం మందలించినా నేతల తీరు మారడం లేదట. అదేదో సాధారణ నియోజకవర్గం కాదు. పెద్ద పొజిషన్లో ఉన్న సీనియర్ పొలిటీషియన్ సెగ్మెంట్ కావడంతో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఏమా అసమ్మతి గోల? లెట్స్ వాచ్..! శ్రీకాకుళం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరుచోట్ల వైసీపీ పాగా వేసింది. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. ఆ ఆరు చోట్లా ఎమ్మెల్యే పేరు చెబితేనే […]
హైదరాబాద్ పర్యటనలో ఆ జాతీయ పార్టీ ఇంఛార్జ్ ఏం చేశారు? రహస్యంగా ఎవరైనా కలిసి మాట్లాడారా? రాష్ట్ర పార్టీ నేతలకు కూడా తెలియకుండా చేయాల్సిన అంత సీక్రెట్ వ్యవహారాలేంటి? ఇంతకీ ఆయన ఎవరు? హైదరాబాద్‌లో రహస్యంగా ఏం చేశారు? లెట్స్ వాచ్…! మాణిక్యం ఠాగూర్. AICC తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్. హైదరాబాద్‌కు వచ్చుడే తక్కువ. అలాంటిది తాజా పర్యటనలో పెద్ద రాజకీయ చర్చకు తెరతీశారు. ఆదివారం ఉదయం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. రాజకీయ వ్యూహకర్త సునీల్‌తో కలిసి […]
శ్రీలంక సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఒక్కొక్కరుగా నాయకులు రాజీనామాలు చేస్తున్నప్పటికీ.. ప్రజల ఆందోళనలు, నిరసనలు ఏమాత్రం తగ్గడం లేదు. నిరసనకారులు నేతల ఇళ్లను, వారికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేస్తూ.. ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఇప్పటికే అనేక మంది నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీనిని ముందుగానే గుర్తించిన విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులు ఆయనను అడ్డుకున్నారు. ఈ నెల 13న అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేస్తారనీ.. ఆ తర్వాత అన్ని […]