బాలకృష్ణ – బోయపాటి శ్రీనుల అఖండ 2 డిసెంబరు 5న రిలీజ్ కావాల్సిఉండగా ఫైనాన్స్ ఇష్యూ కారణంగా రిలీజ్ వాయిదా పడి ఇప్పుడు అన్ని సమస్యలు అధిగమించి ఈ రోజు రాత్రి 9 గంటలకు పైడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీ అయింది. ఓవర్సీస్ లో ఇప్పటికే భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి బజ్ వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే మొదట అనుకున్న రిలీజ్ టైమ్ లో ఉన్న హైప్ కంటే ఇప్పడు వస్తున్న రిలీజ్ టైమ్ లోనే హైప్ ఇంకా పెరిగిందనే చెప్పాలి.
కాగా ఈ సినిమాను ఈ రోజు రాత్రి 9.30 గంటల షోస్ తో రిలీజ్ కాబోతుంది. అయితే మరోవైపు రిలీజ్ కు కౌండౌన్ స్టార్ట్ అయిన నేపధ్యంలో బాలయ్య అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షోస్ కు సంబంధించి 12వ తేదీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు కానీ ప్రీమియర్స్ బుకింగ్స్ మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు అనుమతులు కూడా వచ్చాయి. అలాగే ప్రీమియర్స్ టికెట్ ధర రూ. 600 ను నిర్ణయిస్తూ జీవో ఇచ్చింది. మరి అన్ని అనుమతులు వచ్చిన తుంది. అయితే మరోవైపు రిలీజ్ కు కౌండౌన్ స్టార్ట్ అయిన నేపధ్యంలో బాలయ్య అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ఈ సినిమా రెగ్యులర్ షోస్ కు సంబంధించి 12వ తేదీ బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు కానీ ప్రీమియర్స్ బుకింగ్స్ మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి ప్రీమియర్స్ ప్రదర్శించేందుకు అనుమతులు కూడా వచ్చాయి. అలాగే ప్రీమియర్స్ టికెట్ ధర రూ. 600 ను నిర్ణయిస్తూ జీవో ఇచ్చింది. మరి అన్ని అనుమతులు వచ్చిన కూడా ఇంకా ప్రీమియర్స్ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు మేకర్స్. ఇదే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. అసలు ప్రీమియర్స్ ఉంటాయా ఉండవా ఎదో ఒకటి క్లారిటీ ఇవ్వండని సోషల్ మీడియూలో కామెంట్స్ వినిపిస్తున్నాయి