Nalgonda Politics: ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికారపార్టీ నేత. గత ఎన్నికల్లో ఓడినా నియోజవర్గానికి ఆయన్ని పార్టీ ఇంఛార్జ్‌ను చేశారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి పాగా వేయాలని పార్టీ చూస్తుంటే.. అయ్యవారి వేషాలు మరోలా ఉన్నాయట. సమస్య ముదురు పాకాన పడి.. డేంజర్ బెల్స్ మోగిస్తోందట. దీంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందట అధిష్ఠానం. అదెక్కడో.. ఏం జరుగుతుందో లెట్స్ వాచ్..! ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో 11 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. ఒక్క మునుగోడులో […]
ఒకసారి పదవి రుచిచూస్తే.. తేలిగ్గా వదిలి పెట్టలేరు. ఓడినా పైచెయ్యి సాధించాలని చూస్తారు నాయకులు. ఆ జిల్లాలో రాజకీయ నిరుద్యోగులుగా మారిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఆ పనే చేస్తున్నారట. సిట్టింగ్‌ల కుర్చీల కిందకు నీళ్లను తెస్తున్నట్టు టాక్. ఇంతకీ ఎవరా మాజీలు? ఏమా కథా? ఉమ్మడి విశాఖజిల్లాను కంచుకోటగా మలుచుకుంటోంది వైసీపీ. ఇక్కడ అధికారపార్టీకి 12మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.. అదేస్ధాయిలో మాజీ ఎమ్మెల్యేల నాయకత్వం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చెయ్యడం ద్వారా […]
Telangana Congress Politics టీ కాంగ్రెస్‌లో గాలి దుమారం… ఇద్దరు సన్నిహితుల మధ్య గ్యాప్ తెచ్చిందా? పదవి విషయంలో వచ్చిన పొరపచ్చాలు.. పంతాలు అగ్గి రాజేస్తున్నాయా?. ఇంతకీ ఏంటా వైరం? ఎవరా నాయకులు? లెట్స్ వాచ్..! నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తెలంగాణ కాంగ్రెస్‌లో కామన్. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు కూడా వస్తుంటాయి. భిన్నాభిప్రాయాలతో ఇబ్బంది లేదు. భేదాభిప్రాయాలతోనే సమస్య. పార్టీలో ఇదే ఇప్పుడు తలనొప్పి. పీసీసీ చీఫ్ రేవంత్‌కి సన్నిహితంగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర […]
టీడీపీకి గట్టిపట్టున్న ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెలుసు బారిపోయింది. కీలక నేతలే కవ్వించుకుంటున్నారు. అధికారపక్షానికి అవకాశం ఇవ్వకుండానే తన్నుకు చస్తున్నారు నేతలు. అలాంటి జిల్లాలో టీడీపీ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు త్రిసభ్య మంత్రం వేసింది అధిష్ఠానం. ఈ ప్రయత్నం వర్కవుట్ అయ్యేనా? ఇంతకీ ఏంటా జిల్లా? ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి బలమైన ప్రాంతం. అలాంటి చోట పార్టీకి నాయకులే సమస్యలు తీసుకొస్తున్నారని మూడేళ్లుగా కేడర్ గగ్గోలు పెడుతోంది. 2014లో టీడీపీ 12 […]
Controversy around Patnam Mahender Reddy couple ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా ఉంది అక్కడ టీఆర్ఎస్ పంచాయితీ. తాజా రగడపై రెండు వర్గాలను పిలిచి పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నారు. మరి.. సమస్య కొలిక్కి వచ్చినట్టేనా? ఆ ఫ్యామిలీ చుట్టూనే ఎందుకు చర్చ.. రచ్చ అవుతోంది? ఎవరా నాయకులు? రాజకీయాల్లో ఇదో రకమైన ఉడుంపట్టు. అధికారపార్టీలో పెద్ద పదవుల్లో ఉన్నా.. ఏదో వెలితి. అసెంబ్లీకి పోటీ చేయాలి.. గెలిచి పట్టుసాధించాలి. ఈ […]
Mopidevi Planning for next generation leaders : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలు నిర్వహిస్తున్న బహిరంగ సభలతో ప్రజల్లో చర్చ కూడా జరుగుతోంది. వ్యూహాలకు పదును పెడుతున్నారు నాయకులు. అధిష్ఠానం అభ్యర్థుల మార్పునకు సంకేతాలు ఇస్తే.. ఆ ప్రత్యామ్నాయం కూడా తామే చూపించేలా ప్లాన్ చేస్తున్నారట కొందరు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని కొన్నిచోట్ల.. సామాజిక, రాజకీయ అంశాలు మరికొన్నిచోట్ల అభ్యర్థుల మార్పుకు కారణంగా […]
Konda Vishweshwar Reddy : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఇటీవలే బీజేపీ కండువా కప్పుకొన్న చేవెళ్ల మాజీ ఎంపీ. కొత్త పార్టీలో చేరడం ద్వారా తన దృష్టి చేవెళ్ల లోక్‌సభ సీటుపై ఉందని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తారని.. ఆ మేరకు బీజేపీ నుంచి హామీ లభించిందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇక్కడే బీజేపీలో పంచాయితీ మొదలైంది. కొండా రాకపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. చేవెళ్ల లోక్‌సభ సీటుపై […]
Indian Rupee : సామాన్యుడిపై రూపాయి పిడుగు పడబోతోంది. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిని కరెన్సీ మరింత కుంగదీయనుంది. రూపాయి వేగంగా పతనం కావడంతో దేశంలో ధరలు ఎగసి వినియోగదారులపై పెను భారం పడుతుంది. దిగుమతులకు డాలర్లలో చెల్లించాల్సినందున, ముడి చమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసుల ధరలు పెరుగుతాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో యూఎస్ డాలర్‌పై రూపాయి మారకం విలువ చరిత్రలో తొలిసారి 80కి చేరువైంది. రూపాయి పతనం రికార్డు […]