గోదావరి వరద భయపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదికి పైగా జిల్లాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పాత రికార్డులు బద్దలు కొట్టి మరీ దూసుకొస్తున్న వరద.. మహా విషాదాన్ని కళ్లకు కడుతోంది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరద నీటితో మునిగిపోవడంతో ఉత్తర తెలంగాణలోని గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్ట్ లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. 1986 లో మేడిగడ్డ ప్రాంతంలో రికార్డు అయిన భారీ వరదను మించి గోదావరి ప్రవహిస్తుండడంతో పాటు అదిలాబాద్, నిజమాబాద్, కరీంనగర్, ఖమ్మం, […]
ప్రపంచీకరణ తర్వాత యువకుల్లో కెరీరిజం పెరిగింది. ధర్నాలు, ఆందోళనలు తగ్గిపోయాయి. రాజకీయ భావజాలం అంతరించిపోతోంది. ఇది చాలా మంది అభిప్రాయం. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శ్రీలంక నిరూపించింది. పాలకులంతా శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. ప్రజలు మంచి వాళ్లే. అయితే అతి పేదరికం ఆకలిలోకి నెడితే మాత్రం వెంటపడి తరుముతారు. శ్రీలంకలో జరుగుతున్నది ఇదే. దీనికి పరిష్కారం కూడా అంత సులభం కాదు. కొత్తగా ఎవరొచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. అప్పులిచ్చిన సంస్థలన్నీ […]
రండి నడిరోడ్డుపై తేల్చుకుందామని సవాళ్లు చేసుకున్నారు. సడెన్‌గా ఒకరు డ్రాప్ అయ్యారు. రెండోవాళ్లకు అది అస్త్రంగా మారిపోయింది. మధ్యలో మరో లేడీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. మన్యంలో సవాళ్ల సిగపట్లపై హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం. గిరిజన ప్రాంతమైనా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాటే. కురుపాం ఎమ్మెల్యే.. మాజీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై తాజాగా స్థానిక టీడీపీ నేతలు సవాల్ విసిరారు. […]
అసలే వారిద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది యవ్వారం. ఛాన్స్ దొరకగానే పరస్పరం మాటలతో విరుచుకు పడుతున్నారు. పార్టీ ఇంఛార్జ్ ఎదుటే అలా జరగడంతో అంతా బిత్తర పోయారట. నాకెందుకు చెప్పలేదని ఒకరు.. నీకెందుకు చెప్పాలని ఇంకొకరు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట. ఈ తాజా గొడవపైనే కాంగ్రెస్‌లో చర్చ. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఇద్దరూ కీలక నాయకులే. […]
ఆమెను పొమ్మన లేక పొగ పెడుతున్నారా? మూడేళ్లుగా మహిళా నేత విషయంలో జరుగుతోంది అదేనా? తాజాగా ఒక మీటింగ్‌కు వెళ్లారని షోకాజ్ నోటీసు ఇచ్చి.. సస్పెండ్ చేసినంత పని చేశారా? చివరి నిమిషంలో ఎందుకు వెనక్కి తగ్గారు? ఇంతకీ ఎవరా మహిళా నేత? ఏమా పార్టీ? లెట్స్ వాచ్..! శింగనమల. టీడీపీకి పెద్ద తలపోటుగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధానమైనది. మూడేళ్లుగా పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. ఎస్సీ రిజర్డ్వ్ నియోజకవర్గమైన శింగనమలలో టీడీపీ అధిష్ఠానం చేసిన కొన్ని తప్పిదాలతో […]
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ వైఖరి ఏంటి? విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తుందా? దక్షిణాది లేదా తెలుగు రాష్ట్రాలకు చెందినవారు బరిలో ఉంటే ఏం చేస్తారు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్ వచ్చిన సిన్హాకు ఘన స్వాగతం పలికింది కూడా. ఇదే అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, NCP చీఫ్ శరద్ పవార్ నిర్వహించిన సమావేశాలకు టీఆర్ఎస్ వెళ్లలేదు. […]