ఎర్ర శేఖర్. టీడీపీ నుంచి బీజేపీలోకి అటు నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే. కొన్నాళ్లుగా ఎర్ర శేఖర్ చేరికపై పార్టీలో చర్చ జరుగుతున్నా.. ఈ మధ్య ఆటంకాలు అధిగమించి.. పార్టీ కండువా కప్పుకొన్నారు. దీంతో జడ్చర్ల కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. ఇప్పటికే మాజీ ఎంపీ మల్లు రవి.. యువ నేత అనిరుధ్‌రెడ్డిలు రెండు వర్గాలుగా విడిపోయి కాంగ్రెస్ రాజకీయాలను రక్తికట్టిస్తుంటే.. ఇప్పుడు కొత్తగ ఎర్ర శేఖర్ ఎంట్రీతో రాజకీయం ఇంకా రసవత్తరంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో […]
Guntur Politics: జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా.. పల్నాడు, బాపట్ల, గుంటూరుగా విడిపోయింది. దానికంటే ముందుగానే గుంటూరు, నరసరావుపే, బాపట్ల లోక్‌సభ పరిధిలో కమిటీలను విభజించేశాయి ప్రధాన పార్టీలు. ఈ మార్పులు.. చేర్పులు తర్వాత పార్టీ నేతల వైఖరిలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో కలిసి మెలిసి తిరిగిన నాయకుల మధ్య జిల్లాల విభజన పెద్ద రేఖే గీసిందట. పక్క జిల్లాకి వెళ్లాలంటేనే నాయకులు భయపడుతున్నారట. అక్కడికి వెళ్తే ఆ జిల్లా అధ్యక్షుడు […]
Telangana Congress జుట్టు ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చన్నట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. కాకపోతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ముందుగా మొదలయ్యేది తలనొప్పులే. కాంగ్రెస్‌ను గ్రేటర్ హైదరాబాద్‌లో బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా 3 భాగాలుగా విభజించారు. ఈ నిర్ణయాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. నగరంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురావాలంటే మూడు ముక్కలు చేయాల్సిందేనని పార్టీ గట్టిగా భావించి అడుగులు […]
Vizianagaram YCP Politics: విజయనగరం జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. నేతల మధ్య పోరు కన్నా.. అది సామాజికవర్గాల రణంగా మారడంతో మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేరు చెబితే విజయనగరం బీసీ నేతలు రుస రుసలాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోలగట్లకు కాకుండా బీసీలకు వైసీపీ టికెట్ కేటాయించాలని స్వరం పెంచుతున్నారు అధికారపార్టీలోని ఆ వర్గం నాయకులు. మూడు నెలలుగా ఇదే పెద్ద చర్చగా ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినా […]
Penukonda TDP: అక్కడ గురువుకే చుక్కలు చూపిస్తున్నారా? టికెట్ విషయంలో పోటీకి వస్తున్నారా? ఈ ఎపిసోడ్లో శత్రువుకు శత్రవును మిత్రుడిగా మార్చుకున్నది ఎవరు? సమస్య శ్రుతిమించి పార్టీ పెద్దల వరకు పంచాయితీ వెళ్లిందా? ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా గొడవ? పెనుకొండ టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యతిరేకులంతా ఒక్కటి అవుతున్నారు. ఒకప్పుడు పార్టీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఈ పరిణామాలు తమ్ముళ్లను కలవర పెడుతున్నాయట. గతంలో పెనుకొండ పరిటాల రవి […]
Khammam Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లా టిఆర్ఎస్లో రాజకీయాలు ఎక్కువే. అక్కడ పార్టీలో నేతలు ఎక్కువే. వలస నేతలకు.. పార్టీలో ముందు నుంచి ఉంటున్న వారికి పొసగని పరిస్థితి. ఇటీవల కాలంలో ఈ పోరు రోడ్డున పడి రచ్చ రచ్చ అవుతుండటంతో.. సమస్య పరిష్కారానికి అధికారపార్టీ చర్యలు మొదలు పెట్టింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ ఒక సీటే గెలిచింది. 2018 ఎన్నికల్లోనూ అదే సీన్. ఇక్కడ కాంగ్రెస్ […]
ఇటీవల జరిగిన ఓ ఘటనతో పొలిటికల్‌గా మైలేజ్ వస్తుందని భావించారు అక్కడి నేతలు. అంతలోనే సీన్ రివర్స్. ఒక వర్గానికే పేరు వస్తోందని.. మరోవర్గం చిటపటలాడుతోంది. ఉన్నంతలో ఏదో లాక్కొస్తున్నారని అభిప్రాయ పడుతున్న అధిష్ఠానానికి కొత్త సమస్య పెద్ద చిక్కే తెచ్చిపెట్టిందట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. చిత్తూరు అసెంబ్లీ పరిధిలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేరు. 2014లో డీకే ఆదికేశవుల సతీమణి సత్యప్రభ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో రాజంపేట […]