Anantapur TDP Politics : టీడీపీకి గట్టి పట్టు ఉన్న ఆజిల్లాలో పార్టీ పరిస్థితి పెళుసుబారిపోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీకి గట్టిపట్టున్న ఆ జిల్లాలో పార్టీ పరిస్థితి ప్రస్తుతం పెలుసు బారిపోయింది. కీలక నేతలే కవ్వించుకుంటున్నారు. అధికారపక్షానికి అవకాశం ఇవ్వకుండానే తన్నుకు చస్తున్నారు నేతలు. అలాంటి జిల్లాలో టీడీపీ పరిస్థితిని గాడిలో పెట్టేందుకు త్రిసభ్య మంత్రం వేసింది అధిష్ఠానం. ఈ ప్రయత్నం వర్కవుట్ అయ్యేనా? ఇంతకీ ఏంటా జిల్లా?
ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకప్పుడు టీడీపీకి బలమైన ప్రాంతం. అలాంటి చోట పార్టీకి నాయకులే సమస్యలు తీసుకొస్తున్నారని మూడేళ్లుగా కేడర్ గగ్గోలు పెడుతోంది. 2014లో టీడీపీ 12 చోట్ల గెలిచి.. రెండు ఎంపీ సీట్లను కైవశం చేసుకుంది. 2019 నాటికి సీన్ రివర్స్. 12 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. టీడీపీ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే గెలిచింది. జిల్లాలో పార్టీకి పట్టులేని ప్రాంతాల్లోనూ వైసీపీ భారీ విక్టరీ కొట్టింది. టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలే దానికి కారణమని పసుపు శిబిరంలో చర్చ జరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నికల ముందే టీడీపీ అధిష్ఠానం కొంత వర్కవుట్ చేసినా.. అవి ఫలించలేదు. చివరకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. అయినప్పటికీ టీడీపీ నాయకుల్లో మార్పు రాలేదు.
Also Read
రాష్ట్రంలో ఎన్నికల మూడ్ క్రమేపీ బలపడుతుండటంతో టీడీపీ పెద్దలు చికిత్స ప్రారంభించారు. విభేదాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితిని సెట్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం ముగ్గురు సీనియర్ నాయకులతో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు, బచ్చుల అర్జునుడు, టీడీ జనార్దన్ ఆ కమిటీలో ఉన్నారు. ఈ ముగ్గురు ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చేశారు కూడా. పార్టీ నేతలను పిలిచి సమస్య ఏంటో తెలుసుకుంటున్నారు. ఇంతకాలం వన్‌సైడ్ వెర్షన్ వింటూ నిర్ణయాలు తీసుకున్న టీడీపీ అధిష్ఠానం ప్రస్తుతం పక్కా ప్లాన్‌తో వెళ్తున్నట్టు అభిప్రాయ పడుతున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలను పిలిచి వారు చెప్పేది నోట్ చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పటికే శింగనమల సెగ్మెంట్ నేతల అభిప్రాయాలను.. అభ్యంతరాలను తెలుసుకున్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషాను పిలిచి మాట్లాడారాట.
ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీకి సమస్యలు ఉన్నాయి. వీటిల్లో ఆరుచోట్ల అధిష్ఠానం జోక్యం చేసుకున్నా తగ్గేదే లేదన్నట్టుగా పరిస్థితి ఉంది. కల్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మూడో గ్రూప్ మధ్య అస్సలు పడటం లేదు. శింగనమలలో బండారు శ్రావణి, టూమెన్ కమిటీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, కురుబ బబితల మధ్య అంతర్గత పోరు ఉంది. మడకశికరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిల మధ్య తారాస్థాయిలోనే వర్గపోరు కొనసాగుతోంది. వీరితోపాటు మరో రెండు నియోజకవర్గాల నేతలను కోఆర్డినేషన్ కమిటీ పిలిచి మాట్లాడబోతోంది.
త్రిసభ్య కమిటీ.. నియోజకవర్గాల్లోని సమస్యలను ఆలకించడంతోపాటు రెండువైపుల వాదనలను నోట్ చేసుకుంటోంది. అన్ని సెగ్మెంట్లలో పరిస్థితిని అంచనా వేశాక.. రిపోర్ట్‌ను చంద్రబాబుకు అందచేస్తారట. దాంతో త్రిసభ్య కమిటీ ఇచ్చే రిపోర్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత చంద్రబాబు ఏం చేస్తారో.. ఏమో? మొత్తానికి మూడేళ్ల తర్వాత చేపట్టిన పెద్ద చికిత్స కావడంతో అందరి దృష్టీ చంద్రబాబు వేసే విరుగుడు మంత్రంపై నెలకొంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!