దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించవద్దని ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ లు కూడా దాఖలు అయ్యాయి. అయితే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ట్విటర్‌లో వెల్లడించారు. యువ వైద్య విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా పరిస్థితిని బట్టి ఈ పరీక్షలకు కొత్త తేదీని వెల్లడిస్తామన్నారు. ఇక తెలంగాణలో కూడా పదో తరగతి పరీక్షలు ఈ రోజు రద్దు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పిల్లలని కూడా పరీక్ష లేకుండా రెండో సంవత్సరానికి ప్రమోట్ చేయనున్నారు.