విశాఖ మధురవాడ మిథిలా పూర్ కాలనీ లో ఉన్న ఆదిత్య టవర్స్ లో, ఈరోజు తెల్లవారుజామున బంగారు నాయుడు కుటుంబంలో నలుగురు కూడా మృతి చెందారు. పెద్ద కుమారుడు మినహా మిగతా అందరికీ వాటిపై గాయాలు ఉన్నాయి. అసలేం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిథిలా పూర్ ఉడా కాలనీ ఆదిత్య టవర్స్ లో ఎనిమిది నెలల క్రితం, బంగారు నాయుడు కుటుంబం సి బ్లాక్ లో ఉన్న 505 అద్దెకు దిగారు. . అక్కడికి సమీపంలో ఒక సొంత ఇల్లు కూడా నిర్మించుకునే ఏర్పాటు లో ఉన్నారు. భార్య నిర్మల పెద్ద కుమారుడు దీపక్ చిన్న కుమారుడు కాశ్యప్ తో కలిసి, ఇంట్లోనే ఉంటున్నారు.
రాత్రి కుటుంబ సభ్యుల గొడవ ?
గత రాత్రి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు, రాత్రి కుటుంబ సభ్యులు గొడవపడిన చుట్టుపక్కల వారు చెబుతున్నారు, తెల్లవారుజామున కొంత పెద్ద శబ్దాలు కూడా వినిపించాయి. ఇది జరిగిన కాసేపటికే ఆ బ్లాక్ లో నుంచి మంటలు రావడంతో, చుట్టుపక్కల ఉన్న వారంతా అప్రమత్తమై పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూసేసరికి, కుటుంబ సభ్యులు నలుగురు కూడా మృతి చెందినట్లు గుర్తించారు.. ఇందులో దీపక్ మినహా ముగ్గురు పైన కూడా కత్తి గాట్లు ఉన్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ప్రాథమికంగా పెద్ద కుమారుడు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
తెల్లవారుజామున ప్రమాదం ?
తెల్లవారుజామున మూడున్నర సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుందని. నాలుగు గంటల సమయంలో అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి, గ్రూపులో ఈ ప్రమాదం జరిగినట్లు రావడంతో ఒక్కసారిగా అప్రమత్తం అయ్యామని, ఫైర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి, తలుపులు పగలగొట్టాలని, లోపలికి వెళ్ళి చూసే సరికి మృతదేహాలు ఉన్నాయి.. వారందరికీ కూడా కత్తిపోట్లు ఉన్నాయని, తాము గుర్తించామని, అయితే ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు సౌమ్యంగా వుండే వాళ్లని, ఎప్పుడు విభేదాలు గాని గొడవలు గాని, ఉన్నట్లు తాను ఎప్పుడు గుర్తించ లేదన్నారు. బంగారు నాయుడు కుటుంబం విజయనగరం జిల్లా గంట్యాడ ప్రాంతం, ఐదుగురు అన్నదమ్ముల్లో ఈ నాలుగు వాడని, ఉన్నతమైన చదువులు చదివి బెహరాన్ లో, చాలా కాలం పని చేసి, ఆర్థికంగా బాగానే సంపాదించారని, సివిల్ వర్క్ చేస్తూ విశాఖపట్నం వచ్చేసి ఇక్కడే ఉంటున్నారని, ఎలాంటి సమస్యలు లేవని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, సన్నిహితులు కుటుంబ సభ్యులు అంటున్నారు.
పెద్ద కుమారుడు దీపక్ హతమార్చి ఉంటాడా ?
కుటుంబ సభ్యులను, పెద్ద కుమారుడు దీపక్ హతమార్చి ఉంటాడని భావిస్తున్నారు.. తండ్రి తమ్ముడు తల్లి ఒంటిపైన కత్తి గాయాలున్నాయి.. వాటితో పాటుగా ఇంట్లో రెండు కత్తులు కూడా లభించాయి.. సివిల్స్ ప్రిపేరవుతున్న దీపక్ మానసిక ఒత్తిడితోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.. అయితే బంధువులు స్నేహితులు మాత్రం, దీపక్ అందరి తో బాగానే ఉండేవాడిని, సివిల్స్ ప్రిపేరవుతున్న తాను ఎలా చేశాడంటే మేము నమ్మే పరిస్థితి ఉండదని పూర్తిస్థాయిలో దీన్ని దర్యాప్తు చేయాలని, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.. మరోవైపు ఈ ఘటనపై పలు అనుమానాలు, వ్యక్తమవడంతో పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు సాయంత్రం చీకటి పడే వరకు కూడా కొనసాగించారు.. వీరు నలుగురూ కాకుండా, లోపలికి వేరే ఎవరైనా ప్రవేశించారా.. దీపక్ చాలా సౌమ్యుడు అని బంధువులు చెబుతుంటే, కుటుంబ సభ్యులను, దీపక్ హత్య చేసి ఉంటే, అంత ఘాతుకానికి ఎందుకు పాల్పడ్డాడు.
ఇంటిని తగులబెట్టేందుకు వైన్ బాటిల్స్ ?
అందరూ ఉన్నత విద్యలు చదువుకున్నారు ఒక సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఇలా చేయడానికి ఆస్కారం ఉందా.. ఒక్కొక్కరి ఒంటిపైన 4 నుంచి 5 కత్తి గాట్లు , ఉన్నాయి.. అంతేకాకుండా ఇంటిని తగలబెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు.. ఇందులో ప్రధానంగా వైన్ బాటిల్స్ వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు దీపక్ పూర్తిగా సూట్, టై వేసుకుని బయటకు బయలుదేరినట్లు కనిపిస్తున్నాడు. ఆ మంటల నుండి తప్పించుకునే క్రమంలోనే, మృతిచెందినట్లు భావిస్తున్నారు. మరోవైపు తలుపుకు ఎదురుగా బంగారు నాయుడు మృతదేహం ఉంది.
క్లూస్ సేకరించడం చాలా కష్టం ?
తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది అన్ని వస్తువులు పూర్తిగా నీటితో తడిపి వేశారు. దీంతో క్లూస్ సేకరించడం చాలా కష్టంగా మారింది.. అసలేం జరిగింది అని చెప్పడానికి కుటుంబంలో ఒక్కరు కూడా మిగలక పోవడంతో, ఈరోజు దాటిపోతే, దీనికి సంబంధించిన ఆధారాలు లభించే అవకాశం లేదని, కుటుంబ సభ్యులు బంధువులు, అనుమానం ఉన్న ప్రతి అంశాన్ని కూడా సాయంత్రం వరకు కూడా, పోలీసులు సేకరించే పనిలోనే ఉన్నారు. సాయంత్రం 7:00 తర్వాతనే మృతదేహాలను, పంచనామా పూర్తి వివరాలు సేకరించి కేజీహెచ్కు తరలించారు..