నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించనున్నారు. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం క్లోజయింది. మైకులన్నీ మూగబోయాయి. బయటి వ్యక్తులు ఎవరు నియోజకవర్గంలో ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. డబ్బు పంపిణీ జరుగుతోందంటూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే సాగర్ ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్ జరగనుంది.
సాగర్ ఎన్నిక కోసం 346 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ సీఈవో శశాంక్ గోయల్.. అధికారులతో సమీక్ష జరిపారు. పోలింగ్ సామాగ్రి, విధులు నిర్వర్తించే సిబ్బంది.. పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈసారి వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేశారు.
సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా కోవిడ్ పేషెంట్స్‌కు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు.కోవిడ్ విజృంభణ కొనసాగుతుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ నిర్వహించనున్నారు. మరో పక్క తిరుపతి ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.తిరుపతి ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. గెలిచి, సత్తా చాటాలని పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ విజృంభణ నేపథ్యంలో.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.