అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సేకరించిన 15 వేల చెక్కులు బౌన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ సేకరించిన 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి. చెక్కుల విలువ సుమారు 22 కోట్లుగా ఉంటుందని మందిర ట్రస్ట్ తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు లేకపోవడం,సాంకేతిక సమస్యల కారణంగా చెక్కులు బౌన్స్ అయినట్లు వెల్లడించింది. సాంకేతిక లోపాలు సవరించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ సభ్యులు ఒకరు తెలిపారు.కాగా ఈ చెక్కుల్లో దాదాపు 2 వేల చెక్కులు అయోధ్య నుంచి వచ్చినట్లు చెప్పారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వీహెచ్‌పీ విస్తృతంగా విరాళాలు సేకరించింది.ఈ సందర్భంగా దాదాపు రూ.5 వేల కోట్లు సమకూరగా ట్రస్ట్ ఇంకా అధికారంగా వెల్లడించలేదు. ట్రస్ట్ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్ల రూపాయలకు పైగా విరాళాల సేకరణ జరిగినట్లు సేకరణ ముగిసిన రోజు పేర్కొన్నారు. ఇంకా కొంత నగదు బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉందని, అలాగే కొన్ని చెక్ లు పెండింగ్ లో ఉన్నాయని, బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండటంతో పూర్తి మొత్తంలో ఎంత సేకరణ జరిగింది అన్నది తెలియడానికి మరికొంత సమయం పడుతుందని ట్రస్ట్ తెలియజేసింది.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!