జయసుధ నటిగా జనం మదిలో మంచి మార్కులు సంపాదించుకోవడానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆమె నటించిన "జ్యోతి, ప్రేమలేఖలు, ఆమెకథ" చిత్రాలు కారణమని చెప్పక తప్పదు.
Shubhalekha Sudhakar:ఒకప్పుడు రివటలా ఉండే 'శుభలేఖ' సుధాకర్, ఇప్పుడు రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజ పతిదేవుడు 'శుభలేఖ' సుధాకర్. ఇద్దరూ గళంతో భలేగా ఆకట్టుకుంటున్నారు. గాయనిగా ఆమె, నటునిగా ఈయన సాగుతున్నా, డబ్బింగ్ తోనూ ఇద్దరూ అలరించడం విశేషం
Kantharao: చిత్రమేమో కానీ, అనేక చిత్రాలలో నటరత్న యన్టీఆర్, నటప్రపూర్ణ కాంతారావు అన్నదమ్ములుగా నటించి అలరించారు. వారిద్దరూ 1923లోనే కొన్ని నెలల తేడాతో జన్మించారు. యన్టీఆర్ శతజయంతి మే 28న మొదలు కాగా, నవంబర్ 16న కాంతారావు శతజయంతి ప్రారంభమవుతోంది.
Tollywood Senior Heroes:తెలుగు చిత్రసీమలో 'నట పంచపాండవులు'గా పేరొందిన యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు అందరూ వందలాది చిత్రాల్లో నటించారు.
Tollywood:నటశేఖర కృష్ణ మరణంతో ఆ నాటి 'నటపంచకం'గా పేరొందిన నటరత్న యన్టీఆర్, నటసమ్రాట్ ఏయన్నార్, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అందరూ ఈ లోకాన్ని వీడినట్టయింది.
Krishna Padmalaya studio : నటశేఖర ఘట్టమనేని కృష్ణ, ఆయన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నెలకొల్పిన 'పద్మాలయ' తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది .