Lavanya Tripathi Birthday: లావణ్య అందం పాడుతున్న హిందోళం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Tripathi Birthday: పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. ఆమెలోని సౌందర్యం, శరీరకాంతి ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’తోనే వెండితెరపై వెలిగిన లావణ్య జనం మదిలో ఆ సినిమా టైటిల్ గానే నిలచిపోయింది. ఇప్పటికీ ‘లావణ్య’ అనగానే ‘అందాల రాక్షసి’ అనే రసికులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ యేడాది ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన లావణ్య త్వరలోనే ‘పులి-మేక’ అనే వెబ్ సిరీస్ తోనూ మురిపించనుంది.
లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ దయారామ్ నేషనల్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో లావణ్య త్రిపాఠి డిగ్రీ పూర్తి చేశారు. ముంబయ్ లో చేరినప్పటి నుంచే లావణ్యకు ‘షో బిజ్’లో అడుగు పెట్టాలనే అభిలాష కలిగింది. అందుకు అనువుగానే అడుగులు వేసింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య త్రిపాఠి అనువైన చోట నాట్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ముందుగా “సిఐడి, ప్యార్ కా బంధన్” వంటి టీవీ సీరియల్స్ లో లావణ్య నటించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో లావణ్య తొలిసారి బిగ్ స్క్రీన్ కు పరిచయమయింది. తొలి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది. దాంతో వరుసగా అవకాశాలు లభించాయి. “బ్రమ్మన్, మాయవాన్” అనే తమిళ చిత్రాలలో నటించింది. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే లావణ్య తళుక్కుమంది.
Also Read
- YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
- Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
Allu Arjun: అల్లు అర్జున్‌కి మరో అరుదైన గౌరవం.. జీక్యూ అవార్డ్ సొంతం
లావణ్య నటించిన “దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిమిదేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000 కెఎమ్.పి.హెచ్, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే” చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునే సంపాదించి పెట్టాయి. నాగార్జున సరసన లావణ్య నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఘనవిజయం సాధించింది. అలాగే నాని జోడీగా ఆమె నటించిన ‘భలే భలే మగాడివోయ్’ కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. లావణ్య అందచందాలు ఈ నాటికీ యువకులకు బంధాలు వేస్తూనే ఉన్నాయి. కాబట్టి, ఆమెకు అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో లావణ్య ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
-
Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
-
SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
-
Garapati Divya: నిన్న గుండెపోటుతో హఠాన్మరణం.. నేడు ఫలితాల్లో ఘన విజయం.. జనసేన అభ్యర్థి కన్నీటి గాథ
-
Dheeraj Mogilineni : “ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి”..సమ్మర్ హాలిడేస్’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!