మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పటికి 24 సార్లు బాక్సాఫీస్ వద్ద ఢీ కొన్నారు. అందులో ఎనిమిది సార్లు సంక్రాంతి బరిలోనే పోటీ పడడం విశేషం! అంటే ఈ సారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తొమ్మిదో సారి పొంగల్ హంగామాలో పాలు పంచుకుంటున్నారన్నమాట!
తన ఊపిరిలో సదా నిలచిపోయే తన ప్రాణం 'తెలుగు సినిమా' అంటూ నందమూరి బాలకృష్ణ తన 'అన్ స్టాపబుల్' సెకండ్ సీజన్ ఐదో ఎపిసోడ్ ను ఆరంభించారు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే తన ఛాతీ విప్పారుతుందని, తెలుగు సినిమా అనగానే మరపురాని మరువలేని 'మూడక్షరాల పేరు' యన్.టి.ఆర్. గుర్తుకు వస్తారని ఆయన చెప్పగానే అక్కడ సందడి మొదలయింది.
Guardians Of The Galaxy: మార్వెల్ కామిక్స్ లో ఇప్పటికి రెండు సార్లు అలరించిన 'గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ' బృందం ముచ్చటగా మూడోసారి మురిపించనుంది. 'గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ - వాల్యూమ్ 3' ట్రైలర్ శుక్రవారం విడుదలయింది.
హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్స్ గా జేజేలు అందుకున్న స్టీవెన్ స్పీల్ బర్గ్, ఆయన మిత్రుడు జార్జ్ లూకాస్ కలసి తెరకెక్కించిన 'ఇండియానా జోన్స్' ప్రపంచ వ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ను అలరించింది. ఇప్పటికి నాలుగు భాగాలుగా రూపొందిన 'ఇండియానా జోన్స్' ఫ్రాంచైజ్ లో ఐదో చిత్రంగా 'ఇండియానా జోన్స్ అండ్ ద డయల్ ఆఫ్ డెస్టినీ' 2023 జూన్ 30న విడుదల కానుంది.
జ్యోతిలక్ష్మిలాగా గొప్ప నర్తకి కాదు, జయమాలినిలాగా అందం, చందం ఉన్నదీ లేదు. అయినా సిల్క్ స్మిత ప్రవేశంతో ఆ ఇద్దరికీ కొన్ని అవకాశాలు తగ్గాయి అనడం అతిశయోక్తి కాదు. మరి సిల్క్ స్మితలో ఏముంది? మత్తెక్కించే కళ్ళతో మైమరిపించే ఆకర్షణ ఉంది. అందుకే సిల్క్ ను కొందరు అయస్కాంతం అన్నారు.
గత సంవత్సరం డిసెంబర్ 2న విడుదలైన నటసింహ నందమూరి బాలకృష్ణ, డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ' అనూహ్య విజయం సాధించింది. నిజానికి ఓ దశాబ్దమో, లేదా రెండు దశాబ్దాలో, లేక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు... ఇలా ఓ సంపూర్ణ సంఖ్య పూర్తి చేసుకున్న చిత్రాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాం.
'బ్రూస్ లీ' ఒకప్పుడు ఈ పేరంటే యాక్షన్ మూవీస్ ఫ్యాన్స్ కు మహా ఇష్టం! ఇక బ్రూస్ లీ లాగా ఫైట్స్ చేయాలి అనుకున్నవారికి మరింత ఇష్టంగా ఉండేది. బ్రూస్ లీ నటించిన చిత్రాలను చూసి ఎంతోమంది మార్షల్ ఆర్ట్స్ పై మోజు పెంచుకున్నారంటే అతిశయోక్తి కాదు.
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు' అనే సినిమా రూపొందనుందని అప్పట్లో విశేషంగా వినిపించింది. బాలకృష్ణ తన 100వ చిత్రంగా ఏ సినిమా చేయాలి అన్న నేపథ్యంలో పలు కథలు ఆయనను పలకరించాయి.
Adapaduchu: తెలుగు ప్రజల హృదయాల్లో 'అన్న'గా సుస్థిర స్థానం సంపాదించిన నటులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి. రామారావు. అనేక చిత్రాలలో తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు అన్నగా నటించి మెప్పించిన నటరత్న నటన మరపురానిది. ఆ తీరున ఆయన అభినయంతో అలరించిన చిత్రం 'ఆడపడుచు'. 1967 నవంబర్ 30న విడుదలైన 'ఆడపడుచు' జనాన్ని విశేషంగా అలరించింది.