ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్ ను పొంది మూడో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత నాలుగో స్థానం అలియా భట్ (50.6 మిలియన్ ఫాలోవర్స్)కు, ఐదవది కత్రినా కైఫ్ (48.9 మిలియన్ ఫాలోవర్స్) కు దక్కడం విశేషం. అలియా భట్ ‘ట్రిపుల్ ఆర్, బ్రహ్మస్త్ర, గంగూభాయ్, తక్త్’ వంటి చిత్రాలలో నటిస్తుంటే, కత్రినా ప్రస్తుతం ‘సూర్యవంశీ, టైగర్ 3, ఫోన్ బూత్’ చిత్రాలలో నటిస్తోంది.