దక్షిణాదిన బిజీగా ఉన్న స్టార్ ఎవరంటే తప్పకుండా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుంది. బాలీవుడ్ సినిమా ‘ముంబైకార్’ షూటింగ్ లో ఉన్న విజయ్ ప్రస్తుతం దాదాపు 13 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా ఎన్నో స్క్రిప్ట్ లు విని ఉన్నాడు. వాటిలో కొన్నింటికి డేట్స్ కేటాయించవలసి ఉంది. ‘సైరా, ఉప్పెన’ వంటి చిత్రాలతో తెలుగు వారికి కూడా సన్నిహితుడయ్యాడు విజయ్ సేతుపతి. తెలుగు సినిమాల్లో నటించాలనుకుంటున్న విజయ్ అందుకు అనుగుణంగా తెలుగు కూడా నేర్చుకుంటున్నాడట. విజయ్ సేతుపతి నటించిన తమిళ చిత్రం ‘తుగ్లగ్ దర్బార్’తో పాటు మలయాళ చిత్రం ’19(1)(a)’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి. ఇవి రెండు కూడా తెలుగులో డబ్ కాబోతున్నాయి. ఇక ప్రత్యక పాత్రలో కనిపించనున్న ‘కడైసి వ్యవసాయి’ కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఇవి కాకుండా తమిళంలోనే ‘మామణిదన్, లాభం, యాదుమ్ ఊరే యావరుమ్ కెలైర్, ముగిళ్, కాతు వాకుల రెండ కథల్, కరోనా కుమార్ (కామియో), విడుదలై’ వంటి సినిమాలతో పాటు దీపక్ సుందర్ రాజన్ సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ తమిళ చిత్రాలే. ఇక హిందీలో ‘ముంబైకార్’తో పాటు బహుభాషా చిత్రం ‘గాంధీ టాకీస్’ కూడా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవి కాకుండా ‘నవరస’ అనే వెబ్ సీరీస్ నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్నాడు. అలాగే రాజ్, డి.కె దర్శకత్వంలో మరో వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ‘ఆండవ కానోమ్’ సినిమాకు వాయిస్ కూడా ఇస్తున్నాడు విజయ్ సేతుపతి. ఇన్ని ప్రాజెక్ట్ లలో నటిస్తున్న స్టార్ హీరో ఇండియాలో ఎవరూ లేరన్నది నిజం. మరి విజయ్ లిస్ట్ లో వచ్చి చేరబోయే తెలుగు సినిమాలేవో చూడాలి.